శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు చంద్రన్న బీమా పథకానికి మళ్లించడం సరికాదని, తక్షణమే ఆ నిధులు వెనక్కి తీ సుకురావాలని భవన నిర్మాణ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు మంతిన హరనాథరావు, అధ్యక్షులు ఎ.ల క్ష్మణరావు డిమాండ్ చేశారు. పథకాలను సంక్షేమ బో ర్డు ద్వారానే అమలుచేయాలని కోరుతూ నగరంలో స్థానిక డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం ముందు సోమవారం వారు ధర్నా చేశారు. నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులను ఇతర పథకాలకు మళ్లించడం సరికాదన్నారు. ఈ మేరకు వారు కార్మిక శాఖ అధికారికి వినతి పత్రం అందించారు. ఆయన స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ఈ సందర్భంగా కొందరు కార్మిక నాయకులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా క్లయిమ్‌లు ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ప్రభుత్వ విప్ చెప్పిన వెంటనే పరిష్కరించడం సరికాదన్నారు. కార్యక్రమం లో సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కోశాధికారి ఎ.సత్యనారాయణ, జిల్లాకార్యదర్శి టి.తిరుపతిరావు, కె.హరినారాయణ, కె.చిన్నారావు, ఎన్.అప్పారావు, కామేశ్వరరావు, పి.రాజారావు తదితరులు పాల్గొన్నారు.
‘నిధులు వెనక్కి ఇవ్వాల్సిందే’
Published Tue, Feb 7 2017 7:08 PM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM
Advertisement