పోటీ పరీక్షలపై ఉచిత అవగాహన | Free understanding of competition tests | Sakshi
Sakshi News home page

పోటీ పరీక్షలపై ఉచిత అవగాహన

Published Mon, Aug 12 2013 2:32 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM

Free understanding of competition tests

యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు టైం సంస్థ ఆధ్వర్యంలో ఉచిత అవగాహన కల్పించారు. తిరుపతి బాలాజీ కాలనీలోని ఆదిత్యా టవర్స్‌లో ఉన్న టైం సంస్థలో ఆదివారం బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్స్, ఎస్‌ఎస్‌సీ (స్టాఫ్ సెలక్షన్ కమిషన్)  పోటీ పరీక్షలపై అవగాహన కల్పిం చారు. తిరుపతి టైం సంస్థ నిర్వాహకుడు ఎం.వెంకట్ విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు.

బ్యాంకు పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి? ఉత్తీర్ణులు కావడం ఎలా? అనే అంశాలను వివరించారు. ప్రణాళికాబద్ధంగా సిద్ధమైతే బ్యాంకు ఉద్యోగం సాధించవచ్చన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ పరీక్ష ఎలా రాయాలి? అనే అంశం పై మెళకువలు నేర్పారు. బ్యాంక్ ఉద్యోగాలు పొందాలంటే విద్యార్థులకు కచ్చితత్వం, వేగం అవసరమన్నారు. ఇవి రెండూ పొందాలంటే నిరంతర సాధన అవసరమన్నారు. అలాగే బ్యాంక్ పరీక్షల్లో పరీక్షల విధానం, ప్రశ్నపత్ర సరళిని గురించి విశ్లేషించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement