కర్నూలు: కర్నూలు, అనంతపురం జిల్లాలను అకాల వర్షాలు ముంచేత్తాయి. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కర్నూలు పట్టణంలోని బుధవారపేటలో గోడకూలి ఓ బాలుడు మృతి చెందగా మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఉరవకొండ, పత్తికొండ, కోవెలకుంట్ల, బనగానపల్లె, ఆలూరు, ఆస్పరి, ఆళహరి మండలాల్లో భారీగా వర్షం కురుస్తుంది. కర్నూలు బురుజుల, చిన్నహుల్తీ వద్ద వాగులు పొంగిపోర్లుతున్నాయి. దీంతో ఆదోని-పత్తికొండ, పత్తికొండ-గుంతకల్లు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అనంతలో దోనేకల్లు వద్ద జాతీయ రహదారిపై నీరు చేరడంతో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రెండు జిల్లాల్లో భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకురాయి. జిల్లా కలెక్టర్లు, అధికారులు ఎప్పటికప్పుడూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
అనంత, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు
Published Sun, May 29 2016 9:46 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement