ఎందుకు మాఫీ చేయడం లేదు? | High Court order to AP government on loan waiver | Sakshi
Sakshi News home page

ఎందుకు మాఫీ చేయడం లేదు?

Published Tue, Dec 15 2015 3:57 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

ఎందుకు మాఫీ చేయడం లేదు? - Sakshi

ఎందుకు మాఫీ చేయడం లేదు?

వివరణ ఇవ్వండి.. రైతు రుణాలపై ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

 సాక్షి, హైదరాబాద్:  రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయడం లేదో వివరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తమ రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన సర్కారు.. తమకు మాఫీ వర్తింపజేయడం లేదంటూ కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలకు చెందిన పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. 

వాదనలు విన్న హైకోర్టు, ఎందుకు రుణ మాఫీ చేయడం లేదో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని  ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement