వరంగల్ క్రైం: బాలుడు, అతడి తల్లిపై అమానుషంగా ప్రవర్తించారనే ఆరోపణలపై మడికొండ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌పై పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబు బదిలీ వేటు వేశారు. ‘బాలుడిపై పోలీసుల దాష్టీకం’అనే శీర్షికన ఈనెల 3న ‘సాక్షి’మెయిన్‌లో కథనం ప్రచురితమైంది. దీంతో పలు ప్రజా సంఘాలు మడికొండ ఘటనను పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయారు.
అదేవిధంగా బాధితులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ)ని సంప్రదించారు. మడికొండ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌ను ఈనెల 7న సీడబ్ల్యూసీ ఎదుట హాజరుకావాలని ఆమె నోటీస్ జారీ చేశారు. ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్‌ను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. శ్రీధర్ మడికొండ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు స్వీకరించి 8 నెలలే అవుతోంది.
మడికొండ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ బదిలీ
Published Wed, Sep 6 2017 2:51 AM | Last Updated on Tue, Sep 12 2017 1:57 AM
Advertisement
Advertisement