దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి
కాంగ్రెస్ నేతలపై ఎంపీ వినోద్‌కుమార్ ఫైర్
కరీంనగర్ కార్పొరేషన్: సీఎం కేసీఆర్‌పై చీటింగ్ కేసు పెట్టాలంటూ కాంగ్రెస్ నేతలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంపై కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే ప్రజాక్షేత్రం లో తేల్చుకోవాలన్నారు. ఆదివారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరీంనగర్‌లో రోడ్లు, జిల్లాలో జాతీయ రహదారులు తాము అధికారంలోకి వచ్చాకే తీసుకొచ్చామన్నారు.