ఆదర్శనగర్‌లో దారుణ హత్య
అనంతపురం సెంట్రల్ :
అనంతపురం మండలం కక్కలపల్లి కాలనీ పంచాయతీ ఆదర్శనగర్‌లో హిందూపురానికి చెందిన ఎరికల రాజన్న అలియాస్ రాముడు (45) వరుసకు అల్లుడైన వ్యక్తి చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు..
ఆదర్శనగర్‌లో బంధువు అయిన రామన్న అంత్యక్రియల కోసం సోమవారం ఉదయం రాజన్న వచ్చాడు. కార్యక్రమం పూర్తయ్యాక మధ్యాహ్నం బంధువుల్లో కొందరు మద్యం తాగారు. ఈ సమయంలో పాత మనస్పర్థలన్నీ బయటకు చెప్పుకున్నారు. మాటామాట పెరగడంతో ఆంజనేయులు అలియాస్ బాబి అనే వ్యక్తి దగ్గర్లోని కొడవలి తీసుకొని రాజన్నపై విచక్షణారహితంగా నరకడంతో అతను అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. నాల్గవ పట్టణ ఇన్‌చార్జ్ సీఐ కష్ణమోహన్, పోలీసు సిబ్బంది ఘటనాస్థలిని పరిశీలించారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్య జరిగిన ప్రదేశం నాలుగో పట్టణ పరిధిలోకి రాకపోవడంతో టూటౌన్ పోలీసులకు కేసును బదిలీ చేశారు.