పచ్చని పల్లెల్లో బూట్ల చప్పుళ్లు..
పచ్చని పల్లెల్లో బూట్ల చప్పుళ్లు..
Published Tue, Oct 4 2016 5:48 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
–రొయ్యిల కంపెనీ నిర్మాణం ఎఫెక్ట్
–అడుగడుగునా పోలీస్ ఆంక్షలు
–ఊళ్ళు వదిలిన మగాళ్ళు
–మర్డర్ కేసులు, బైయిడోవర్ సెక్షన్‌లు
–తుందుర్రు చుట్టుపక్కల భయానక వాతావరణం
నరసాపురం:
నరసాపురం మండలం కంసాలభేతపూడి, భీమవరం మండలం తుందుర్రు, జొన్నలగరువు చుట్టుప్రక్కల ప్రాంతాలు..పశ్చిమడెల్టాలో ప్రశాంతతకు నిలయాలు.. వ్యవసాయమో, ఏదో ఉధో్యగమో చేసుకుంటూ..ఈ ప్రాంత జనం సోదరభావంతో ఉన్నారో, లేరో అన్నట్టుగా ఆదర్శంగా ఉండేవారు. ఈ గ్రామాల్లోకి వెళితే చుట్టూ పచ్చని పొలాలు, పనులు చేసుకునే రైతులు తారపపడేవారు. అ్చమైన తెలుగుగ్రామసీమ వాతావరణ ఉట్టిపడేది. అయితే రెండు నెలలుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ ఆదేశాలతో గ్రామాల్లో పూర్తిగా పోలీస్‌రాజ్యం నడుస్తోంది. ఊరివారు బయటకు వెళ్ళాలంటే, ఆధార్ కార్డులతో సహా, అన్ని ఆధారాలు పోలీసుఏలకు చూపించి, పొలిమేర దాటాల్సిన పరిస్థితి. పొరుగువారు గ్రామాల్లో ఇళ్ళకు పలకరింపులకు వచ్చినా కూడా, పోలీస్‌నిఘా వెంటాడుతోంది. ఖాళీలు అడిగే ప్రశ్నిలకు సమాధానాలు చెప్పలేక, వారిని సంతప్తి చెందించలేక నానా అవస్థలు పడుతున్నారు. తుందుర్రులో..తమ గ్రామాల మధ్య కాలుష్య కారణమైన మెగాఆక్వాఫుడ్‌పార్కును నిర్మించవద్దని, రోడ్డెక్కడమే ఇక్కడి ప్రజలు చేసిన పాపమైయియంది..
–కేసులతో బెంబేలెత్తిస్తున్నారు..
తుందర్రులో మెగాక్వాఫుడ్‌పార్కును వ్యతిరేకిస్తూ గత ఏడాదిన్నరగా జరుగుతున్న ఉధ్యమం, గత 8 నెలల నుంచి తీవ్రరూపం దాల్చింది. కేంద్ర ప్రభుత్వం 50శాతం రాయితీతో రూ 150 కోట్లుపైనే బడ్జెట్‌తో అక్రమంగా నిర్మిస్తున్న ఫ్యాక్టరీతో తమ మనుగడకే ముప్పు ఉందని నరసాపురం, భీమవరం, వీరవాసరం, మొగల్తూరు మండలాల రైతులు, మత్స్యకారులు, జనం ఆందోళన చేస్తున్నారు. అయితే ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితీరుతుందంటూ, సాక్షాత్తు ముఖ్యమంత్రి నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో ప్రకటన చేసిన అనంతరం..ఉధ్యమంపై ఉక్కుపాదం మోపడం ప్రారంభించారు. ఎమ్మెల్యేలు నోరు మెదపడం మానేసారు. అప్పటి వరకూ ఉధ్యమంపై సానుభూతి చూపిన అధికారులు మాటమార్చారు. ఇక గ్రామాల్లో ఒకరకంగా పోలీస్ పాలన ప్రారంభమైయ్యింది. 307 సెక్షన్ క్రింద మహిళలతో సహా పలువురిపై కేసులు నమోదు చేసి జైళ్ళలో పెట్టారు. 130 మందిపై 107 సెక్షన్‌లో నరసాపురం సబ్‌కలెక్టర్ వద్ద బైండోవర్ కేసులు పెట్టారు. ఎఫ్‌ఐఆర్‌లో పలానా వ్యక్తి, తదితరులు అంటూ చేర్చడం..నోరెత్తి మాట్లాడిన వారిని ఆ తదితరుల్లో చేర్చి జైలుకు తరలించడం చేస్తున్నారు. బెయిల్ కూడా రాని సెక్షన్‌లు బనాయించడంతో, అరెసై ్టన ఏడుగురు జైళ్ళలో మగ్గుతున్నారు.
–అడుగడుగా..పోలీస్ ఫికెట్..
ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతున్న తుందుర్రు..చుట్టుప్రక్కల గ్రామాలో అడుగడునా పోలీస్ నిఘా..గ్రామలకు ఎవరు వస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు..అంతా ఇంటిలిజెన్స్ వార్గల ద్వారా ఎప్పటికప్పుడు ఆరా. ఎవరైనా ఇంటికి వచ్చి వెళితే, అర్ధరాత్రి కూడా పోలీసులు ఇంటికొచ్చి..వాళ్ళు ఎవరు, ఎందుకొచ్చారు అని ప్రశ్నలు వేసి హింసిస్తున్నారని, వేళాకోళంటగా ఉందా కేసులో ఇరికించేయమంటారా? అంటూ భెధిరిస్తున్నారని పేరు చెప్పడానికి భయపడిన ఓ మహిళ సాక్షి ముందు విలపించింది. ఫ్యాక్టరీ నిర్మించే ప్రాంతం నుంచి ప్రతీ 30 మీటర్లకు ఓ పోలీస్ ఫికెట్‌ను ఏర్పాటు చేసారు. దాదాపు 400 మంది పోలీసులు రాత్రి, పగలూ తేడాలేకుండా గ్రామాల్లో పహారా కాస్తున్నారు. మరో 200 మంది పోలీసులు ఎప్పుడైనా గ్రామాల్లో వెళ్ళడానికి నరసాపుం, భీమవరం పట్టణాల్లో సిద్దంగా ఉంటున్నారు. తుందుర్రు వ్యవహారంలో సేవలు అందిస్తున్న పోలీసులకు టీఏలు, డీఏలు, జీతాలు కలుపుకుంటే నెలకు రూ 5 లక్షలు వరకూ ప్రభుత్వం వెచ్చిస్తున్నట్టు అంచనా.దేశ సరిహద్దు ప్రాంతాలను తలిపించే రీతిలో భయానక వాతావరణం గ్రామాల్లో నెలకొనే విధంగా ప్రభుత్వం ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తోందనేది ప్రస్తుతం విస్తతంగా జరుగుతున్న చర్చ. మూడు గ్రామాల్లో పురుషులు చాలామంది ఇళ్ళను వదిలి అండర్‌గ్రౌండ్‌కు వెళ్ళిపోయారు. కేసుల్లో ఉన్నవారు కొందరైతే, గతంలో ఫ్యాక్టరీకి వ్యతిరేఖంగా మాట్లాడాము, కాబట్టి తదితరుల్లో తమ పేరు ఎక్కడ చేర్చేస్తారోననే భయం మిగతా వారిలో ఉంది. ఈ గ్రామాలకు చుట్టాల రాకపోకలు బంద్ అయ్యాయి. ఇంత దారుణ పరిస్థితి ఎప్పుడూ చూడలేదని, గ్రామంలోకి పోలీసులు రావడమే తెలియదని..ఇదేం పాపమని గ్రామంలో వద్దులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.
–మేమేమైనా మర్డర్లు చేసామా?
మేమేమైనా మర్డర్లు చేసామా? 307 కేసులు కట్టడానికి. పోలీసులు వస్తున్నారు, మా ఇళ్ళచుట్టూ తిరుగుతున్నారు , మేం చేసిన పాపం ఏమిటి. గ్రామంలో ఇళ్ళ మధ్య ఫ్యాక్టరీ వద్దు అని అడిగాము. ఈ హక్కుకూడా పోనీ అందరినీ చంపేయండి, చంపేసి ఫ్యాక్టరీ కట్టండి. నేనే ఈ ఊరికి వచ్చి 25 ఏళ్ళు అయ్యింది. ఇంత దారుణం ఎక్కడా చూడలేదు. మావల్ల ఫ్యాక్టరీ యాజమాన్యానికి ప్రాణహాని ఉందంట, సబ్‌కలెక్టర్ వద్ద బైండోవర్ కేసు పెట్టారు.
–మగాళ్ళు ఊళ్ళలో లేరు–చినిమిల్లి రత్నం, తుందర్రు
నా చెల్లిలి కొడుకు ఉధ్యమంలో పాల్గొన్నాడు. కేసు పెట్టారు. ఊళ్ళో ఇళ్ళలో మగాళ్ళు ఎవరూ లేరు. కేసులకు భయపడి అందరూ పారిపోయారు. ఇదెక్కడి దారుణం. మా ఇళ్ళకు చుట్టాలు కూడా రావడం మానేసారు. నా వయస్సు 65 సంవత్సరాలు. ఎప్పుడూ గ్రామంలో పోలీసులను చూడలేదు. ఇప్పుడు రోడ్డుమీదకు వెళితే పోలీసులే కనిపిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని, బిక్కుబిక్కు మంటూ బ్రతుకుతున్నాము. గుట్టుగా బ్రతికే వాళ్ళము, ఎప్పుడూ రోడ్కెక్కి ఎరుగము..
–మానవ హక్కులు కాలరాస్తున్నారు. కె.రాజారామ్మోహన్‌రాయ్, సీపీఎం,జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు
సెక్షన్ 144, సెక్షన్ 30, ఆర్డీవో వద్ద బైండోవర్ కేసులు..పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గ్రామాల్లో పోలీస్ ఫికెట్‌లా. వీళ్ళేమైనా నక్సలైట్లా. ఎవరినైనా చంపేసారా, ఇదెక్కడి దారుణం. ప్రభుత్వం మానవహక్కులను కూడా కాలరాస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ, ఫ్యాక్టరీ కట్టనివ్వం, భాదిత గ్రామాలకు అండగా రాష్ట్ర వ్యాప్త పోరాటం చేస్తాము.
Advertisement
Advertisement