రైఫిల్ షూటింగ్
రైఫిల్ షూటింగ్‌కు ఆదరణ
Published Mon, Jul 18 2016 2:29 PM | Last Updated on Mon, Sep 4 2017 5:16 AM
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో రైఫిల్ షూటింగ్‌పై ఆదరణ పెరుగుతోందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్ తెలిపారు. జిల్లా రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ఆ ధ్వర్యంలో శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో ఆది వారం జరిగిన జిల్లాస్థాయి షూటింగ్ క్రీడాకారుల ఎంపికలు కోలాహలంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహిం చిన కార్యక్రమంలో డీఎస్‌డీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ రైఫిల్ షూటింగ్ విభాగంలో గత రెండు మూడు ఒలింపిక్స్‌లో మన భారతీయ క్రీడాకారులు పతకాలు పంట పండిస్తుండటం శుభపరిణామమని అన్నారు. జిల్లా రైఫిల్ షూ టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు పి.తిరుమలరావు మాట్లాడుతూ షూటింగ్ క్రీడ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. కార్యక్రమంలో సంఘ కార్యదర్శి పి.మధు, చీఫ్ కోచ్ పి.టి.హరీష్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
కోలాహలంగా ఎంపికలు..
ఇదిలా ఉండగా సబ్–జూనియర్ (17ఏళ్లలోపు), జూనియ ర్ (19ఏళ్లలోపు), సీనియర్స్(18ఏళ్లు పైబడి) విభాగాల్లో నిర్వహించిన ఈ ఎంపికలు ఆద్యంతం కోలాహలంగా సాగాయి. రైఫిల్స్ చేతబట్టుకున్న క్రీడాకారులు ఉత్సాహంగా చెలరేగిపోయారు.
బాలబాలికలకు వేరువేరుగా ఎంపికలను నిర్వహించారు. కాగా ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు గుంటూరులోని ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రాతి నిథ్యం వహిస్తారని అధ్యక్షులు తిరుమలరావు తెలిపారు. ఎంపికైన క్రీడాకారుల జాబితాను త్వరలో వెల్లడిస్తామన్నారు.
Advertisement
Advertisement