వైభవంగా శ్రీ సౌమ్యనాథస్వామి కల్యాణ మహోత్సవం
నందలూరు
నందలూరులో శ్రీ సౌమ్యనాథస్వామి కల్యాణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. రాజంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు తీసుకువచ్చారు. కల్యాణం అనంతరం గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. కల్యాణం తిలకించడానికి జిల్లా వ్యాప్తంగా విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. రాత్రి గజవాహన సేవ, ఊంజల్‌సేవ, ఏకాంత సేవ నిర్వహించారు.
సోమలరాజు చంద్రశేఖర్‌రాజు, పారిశ్రామికవేత్త, తిరుపతి చెందినవారు, మేడా విజయశేఖర్‌రెడ్డి, మేడా రాజశేఖర్‌రెడ్డి, చెన్నయ్యగారిపల్లెకు చెందినవారు మధ్యాహ్నం 50 వేల మంది భక్తాదులకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మెన్ సతీష్‌రెడ్డి, శాసనమండలి ప్రతిపక్షనేత సి. రామచంద్రయ్య, ఆయన సతీమణి, ఆర్డీవో ప్రభాకర్‌పిళ్ళై, రాజంపేట డీఎస్పీ రాజేంద్ర, ఒంటిమిట్ట సీఐ శ్రీరాములు, ఆలయ ప్రతినిధులు యెద్దుల సుబ్బరాయుడు, పల్లె సుబ్రమణ్యం, గంటా వాసుదేవయ్య, చక్రాల రామసుబ్బన్న, రాజంపేట మార్కెట్‌యార్డు ఛైర్మెన్ యెద్దుల విజయసాగర్, జెడ్పీటీసీ సభ్యుడు శివరామరాజు, నందలూరు ఎస్సై భక్తవత్సలం, నందలూరు తహశీల్దార్ దార్ల చంద్రశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.