వెల్దుర్తి కళాశాలలో సరస్వతమ్మ విగ్రహం
వెల్దుర్తి: స్థానిక ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సరస్వతమ్మ విగ్రహం కళ తప్పుతోంది. ఈ కళాశాల నిర్మాణానికి 2006లో స్థానికంగా ఉన్న డాక్టర్ రాయరావు వెంకటేశ్వరరావు ఐదు ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు. నాటి నుంచి నేటివ రకు ప్రభుత్వాలు దశల వారీగా కళాశాల నిర్మాణానికి లక్షలాది రూపాయలు మంజూరు చేశారు.
అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా భవన నిర్మాణాలు అసంపూర్తిగా నిర్మిస్తూనే ఉన్నారు. 2013లో సరస్వతమ్మ విగ్రహాన్ని కళాశాల ఆవరణలో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. ఆదరణ తగ్గడంతో సరస్వతమ్మ విగ్రహం రంగు వెలసి కళావిహీనంగా ఉంది. ఇప్పటికైనా విగ్రహానికి రంగులు వేసి ఆదరణ చూపాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.