గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయాలి
Published Thu, Sep 22 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
కొల్లాపూర్ రూరల్ : గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ ప్రచారక్ సీతారామస్వామి అన్నారు. మంగళవారం భారత్ పరిశ్రమ పాదయాత్రలో భాగంగా కొల్లాపూర్ పట్టణానికి చేరుకున్నారు. ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, భజరంగ్‌దల్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం మహబూబ్ ఫంక్షన్ హాల్‌లో విద్యార్థులతో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం బాగు పడుతుందన్నారు. గ్రామాల్లో విద్యను, పారిశుద్ధా్యన్ని అమలు చేయాలని, నిరక్షరాస్యతను నిర్మూలించాలన్నారు. అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 2012 జులై 12న కన్యాకుమారి నుంచి పాదయాత్ర చేపట్టామన్నారు. 2017జులై 9 వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గోస్వా ప్రముఖ్ ప్రచారక్ ఆకుతోట రామారావు, బీజేపీ నాయకులు ధనుంజయుడు, శేఖర్, సందు రమేష్, రమేష్ రాథోడ్; భజరంగ్‌దల్ నాయకులు బొమ్మరిల్లు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement