ఐచర్‌ ఢీకొని విద్యార్థి దుర్మరణం | student dies of eicher accident | Sakshi
Sakshi News home page

చర్‌ ఢీకొని విద్యార్థి దుర్మరణం

Published Thu, Mar 2 2017 9:22 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

ఐచర్‌ ఢీకొని విద్యార్థి దుర్మరణం - Sakshi

ఐచర్‌ ఢీకొని విద్యార్థి దుర్మరణం

కళ్యాణదుర్గం రూరల్ : ఐచర్‌ వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థి దుర్మరణం చెందాడు. పట్టణంలో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన బాషా, రోషణమ్మల కుమారుడు మన్సూర్‌(18), పుజారి నాగరాజు అలివేలమ్మల కుమారుడు పుజారిశివ, వెంకట సాయి స్నేహితులు. వీరు ముగ్గురు  పట్టణంలోని జ్ఞానభారతి కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌లో ప్రథమ సంవత్సరం చదువుతున్నారు.

గురువారం వీరు ద్విచక్రవాహనంలో ముప్పులకుంట రోడ్డులో ఉన్న బాలా వారి తోటలో ఈతకెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. కాస్త ముందుకు రాగానే కళ్యాణదుర్గం నుంచి బొమ్మగానిపల్లికి వెళ్తున్న ఐచర్‌ వాహనం వీరిని ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనంలో ఉన్న మన్సూర్‌ అక్కడికక్కడే మృతి చెందగా పుజారి శివ, వెంకటసాయికి గాయాలయ్యాయి. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement