ముగ్గురికి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు | three persons selected for best teachers | Sakshi
Sakshi News home page

ముగ్గురికి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

Published Wed, Aug 31 2016 11:55 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

ముగ్గురికి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

ముగ్గురికి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లా వాసులు ముగ్గురు ఎంపికయ్యారు. రాయలసీమ యూనివర్సిటీ స్థాయిలో స్టాటిస్టిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మధుసూదన్‌ వర్మ, కాలేజీ స్థాయిలో ఉస్మానియా డిగ్రీ కళాశాలలో ఇంగ్లీషు లెక్చరర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ఎస్‌. మహ్మద్‌ బాషా ఎంపికయ్యారు. అవార్డులకు ఎంపికైన ఇద్దరిని రాయలసీమ యూనివర్సిటీ వైస్‌చాన్సులర్‌ వై.నరసింహులు, రిజిస్ట్రార్‌ అమర్‌నాథ్‌ అభినందించారు. ఈ యేడాది రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఉస్మానియా కళాశాల అధ్యాపకుడు ఎంపిక కావడంపై ప్రిన్సిపాల సిలార్‌మహ్మద్, కార్యదర్శి అజ్రాజావేద్‌ హర్షం వ్యక్తం చేశారు. 
ఇంటర్మీడియట్‌ స్థాయిలో..
ఇంటర్మీడియట్‌ విభాగంలో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు నంద్యాలలోని నేషనల్‌ జూనియర్‌ కళాశాలలో సంస్కతం అధ్యాపకుడిగా పనిచేస్తున్న హయగ్రీవచార్యులు ఎంపికయ్యారు. ఈ మేరకు బోర్డు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement