బైక్ కడగడానికి చెరువుకు వెళ్లి.. | two dies after drown in tank in krishna district | Sakshi
Sakshi News home page

బైక్ కడగడానికి చెరువుకు వెళ్లి..

Published Sun, Aug 7 2016 2:12 PM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

two dies after drown in tank in krishna district

గన్నవరం(కృష్ణాజిల్లా): బైక్ శుభ్రం చేయడానికి చెరువుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందారు. ఈ సంఘటన కృష్ణాజిల్లా గన్నవరం మండలం మర్లపాలెం చెరువులో ఆదివారం వెలుగుచూసింది. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన మణిబాబు(10), సన్నీ(19) ఇద్దరు కలిసి ద్విచక్రవాహనాన్ని శుభ్రం చేయడానికి చెరువు వద్దకు వెళ్లారు. బైక్ కడిగి పక్కకు పెట్టి స్నానం చేయడానికి చెరువులోకి దిగారు.

ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉండటంతో.. అందులో మునిగిపోయారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని రక్షించడానికి యత్నించేలోపే మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement