పకడ్బందీగా సర్వే నిర్వహించాలి
►పకడ్బందీగా సర్వే నిర్వహించాలి
జైనథ్(ఆదిలాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న రైతు సమగ్ర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని వ్యవసాయ శాఖ కమిషనరేట్ రాష్ట్ర పరిశీలకులు వై.సుధాకర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మాండగాడ గ్రామంలో కొనసాగుతున్న ‘మా భూమి–మా పంట’ సమగ్ర సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఈవోలు గ్రామాల వారీగా ప్రతీ ఇంటికి తిరుగుతూ సర్వే నిర్వహించాలని అన్నారు. రైతు వివరాలు, ఫొటో, సంతకంతోపాటు భూమి, భూమి స్వభావం, వ్యవసాయ పనిముట్లు, బ్యాంకు ఖాత వివరాలు సంబంధిత ఫార్మెట్‌లో నమోదు చేయాలని తెలిపారు. కాగా రైతుల భూముల వివరాలు రెవెన్యూ రికార్డులైన 1(బి) ప్రకారం సర్వే చేపట్టాలని అన్నారు. జూన్ పదిలోగా అన్ని గ్రామాల్లో సర్వే పూర్తి చేసి, వ్యవసాయ శాఖ వెబ్ పోర్టల్‌లో పొందుపర్చాలని ఆదేశించారు. ఆయన వెంట ఏడీఏ పుల్లయ్య, ఏఈవో విశ్వామిత్ర, రైతులు ఉన్నారు.