అంత దమ్ము చంద్రబాబుకు లేదు: వైఎస్ జగన్ | YS Jagan mohan reddy dares chandrababu naidu to fight elections | Sakshi
Sakshi News home page

అంత దమ్ము చంద్రబాబుకు లేదు: వైఎస్ జగన్

Published Thu, Jun 2 2016 4:36 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

అంత దమ్ము చంద్రబాబుకు లేదు: వైఎస్ జగన్ - Sakshi

అంత దమ్ము చంద్రబాబుకు లేదు: వైఎస్ జగన్

అనంతపురం : ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి తిరిగి ఎన్నికలకు వెళ్లే దమ్ము, ధైర్యం చంద్రబాబు నాయుడికి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజల దగ్గరకు వెళితే ఎవరేంటో తెలుస్తుందని ఆయన సవాల్ విసిరారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న వైఎస్ జగన్ గురువారమిక్కడ మాట్లాడుతూ వేరే పార్టీ బీఫామ్లపై గెలిచిన ఎమ్మెల్యేలను అవినీతి సొమ్ముతో కొంటున్నారని మండిపడ్డారు. ఈ చర్య చూస్తుంటే చంద్రబాబుకు తన పాలన మీద తనకే నమ్మకం లేదనిపిస్తోందన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయించడం లేదని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ఇక నవ నిర్మాణ దీక్ష పేరుతో ఆయన ప్రజలను హేళన చేస్తున్నారని అన్నారు. అవినీతి రహిత రాష్ట్రమని చెబుతున్న ఆయన నిండా అవినీతిలో మునిగారన్నారు.

ఓటుకు కోట్ల కేసు భయంతోనే  తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజక్టుల గురించి చంద్రబాబు మాట్లాడటం లేదని వైఎస్ జగన్ విమర్శించారు. సీబీఐ విచారణ జరుపుతుందేమోననే శంకతో  అక్రమ ప్రాజెక్టుల విషయంలోనూ మోదీని కూడా నిలదీయలేకపోతున్నారన్నారు. అందువల్లే కేంద్రం రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement