‘ది డిస్కవరీ ఆఫ్ ఇండియా’ పుస్తకాన్ని రచించింది? | The Discovery of India' book? | Sakshi
Sakshi News home page

‘ది డిస్కవరీ ఆఫ్ ఇండియా’ పుస్తకాన్ని రచించింది?

Published Thu, Sep 25 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM

‘ది డిస్కవరీ ఆఫ్ ఇండియా’ పుస్తకాన్ని రచించింది?

‘ది డిస్కవరీ ఆఫ్ ఇండియా’ పుస్తకాన్ని రచించింది?

 ప్రపంచంలోనే మొదటగా వెలిసిన విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా, వివిధ దేశాల విద్యార్థులను ఆకర్షించిన ప్రాచీన నలందా విశ్వవిద్యాలయం బీహార్‌లోని ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన రాజ్‌గిర్‌లో పునఃప్రారంభమైంది. దాదాపు 821 సంవత్సరాల తర్వాత మళ్లీ తాత్కాలిక ప్రాంగణంలో సెప్టెంబర్ 1న తరగతులు మొదలయ్యాయి. ఈ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ 2014, సెప్టెంబర్ 19న లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మంజి, వర్సిటీ వైస్ చాన్సలర్ గోప సభర్వాల్, ఫ్యాకల్టీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్ (లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్) తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నలందా విశ్వవిద్యాలయ వివరాలను పరిశీలిస్తే..
 
 15 మందితో ప్రారంభం:
 నలందా విశ్వవిద్యాలయంలో ప్రవేశం కోసం దాదాపు 40 దేశాలకు చెందిన 1,000 మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. తొలి విడతగా పర్యావరణ శాస్త్రంపై తరగతులను 11 మంది అధ్యాపకులు, 15 మంది విద్యార్థులతో ప్రారంభించారు.
 
 గుప్తుల కాలంలో:
 ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థుల్ని ఆకర్షించిన నలందా విశ్వవిదాల్యయం ఐదో శతాబ్దంలో గుప్తుల కాలంలో ప్రారంభమైంది. ఇందులో 10 వేల మంది విద్యార్థులు, 1500 మంది అధ్యాపకులు ఉండేవారు. ఇక్కడ తొమ్మిది అంతస్తుల గ్రంథాయం కూడా ఉండేది. క్రీ.శ. 1193లో భక్తియార్ ఖిల్జీ సైన్యం ఈ విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసింది. అప్పటి నుంచి ఇది శిధిలావస్థలో ఉంది.
 
 కలాం చొరవ:
 నలందా విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించాలని 2006లో నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం బీహార్ అసెంబ్లీలో ప్రసంగం సందర్భంగా ప్రతిపాదించారు. ఆ తర్వాత 2010 ఆగస్టులో నలందా యూనివర్సిటీ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. అదే సంవతర్సం సెప్టెంబర్ 21న రాష్ట్రపతి ఆమోదించడంతో ఈ బిల్లు చట్టం రూపం దాల్చింది. అదే ఏడాది నవంబర్ 25 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ విశ్వవిద్యాలయ మొదటి చాన్సలర్‌గా నోబెల్ గ్రహీత అమర్త్య సేన్, వైస్‌చాన్సలర్‌గా గోప సభర్వాల్ 2011 ఫిబ్రవరిలో నియమితులయ్యారు.
 
 455 ఎకరాల భూమి:
 నలందా విశ్వవిద్యాలయ నిర్మాణానికి బీహార్ ప్రభుత్వం 455 ఎకరాల భూమిని కేటాయించింది. జపాన్, సింగపూర్ దేశాలు 100 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. 2010లో చైనా మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. దీన్ని ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,727 కోట్లు కేటాయించింది. 2020 నాటికి వర్సిటీకి పూర్తిస్థాయి క్యాంపస్ అందుబాటులోకి రానుంది.
 ప్రాక్టీస్ బిట్స్
 
 1.    ఇటీవల భారత్‌లో పర్యటించిన చైనా అధ్యక్షుడు?
     ఎ) జియాంగ్ జెమిన్     బి) హు జింటావో
     సి) లీ కెకియాంగ్     డి) జీ జిన్‌పింగ్
 
 2.    క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిచిన విద్యాసంస్థ?
     ఎ) మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
     బి) కేంబ్రిడ్జ్         సి) ఇంపీరియల్
     డి) హార్వర్డ్
 
 3.    లోక్‌సభ నైతిక విలువల కమిటీ చైర్మన్‌గా 2014, సెప్టెంబర్‌లో ఎవరు నియమితులయ్యారు?
     ఎ) ప్రహ్లాద్ జోషి     బి) మురళీ మనోహర్ జోషి
     సి) ఎల్‌కే అద్వానీ     డి) బి.సి.ఖండూరి
 
 4.    2014, సెప్టెంబర్ 17న జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఎవరిని నియమించారు?
     ఎ) మీనాక్షి లేఖి
     బి) శాంతా సిన్హా
     సి) నిర్మలా సీతారామన్
     డి) లలితా కుమార మంగళం
 
 5.    2014, సెప్టెంబర్‌లో ఆత్మహత్య చేసుకున్న శంకర్ బారువా ఏ రాష్ట్ర మాజీ డీజీపీ?
     ఎ) అసోం         బి) బీహార్
     సి) ఒడిషా         డి) త్రిపుర
 
 6.    భారత సంతతి అమెరికన్ బాబీ జిందాల్ అమెరికాలోని ఏ రాష్ట్రానికి గవర్నర్?
     ఎ) కాలిఫోర్నియా     బి) నార్త్ కరోలినా
     సి) సౌత్ కరోలినా     డి) లూసియానా
 
 7.    17వ గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ పురస్కారం ఏ దర్శకుడికి లభించింది?
     ఎ) ఎస్.ఎమ్.వసంత్     బి) గౌతమ్ మీనన్
     సి) గ్యాన్ కొర్రియా     డి) రోహిత్ శెట్టి
 
 8.    2014, మార్చి 12 నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సంస్థ?
     ఎ) ఫేస్‌బుక్     బి) వరల్డ్ వైడ్ వెబ్
     సి) గూగుల్         డి) మైక్రోసాఫ్ట్
 
 9.    2014 మార్చిలో ఆసియా యూత్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రాగాల వెంకట రాహుల్ రెండు స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించాడు. ఈ పోటీలను ఎక్కడ నిర్వహించారు?
     ఎ) సియోల్ -దక్షిణ కొరియా
     బి) టోక్యో-జపాన్    సి) హనోయ్-వియత్నాం
     డి) బ్యాంగ్ సేన్-థాయ్‌లాండ్
 
 10.    ఏ సాహిత్య బహుమతిని గతంలో ‘ఆరెంజ్ ప్రైజ్’గా పేర్కొనేవారు?
     ఎ) పులిట్జర్ ప్రైజ్     బి) మ్యాన్ బుకర్‌ప్రైజ్
     సి) బెయిలీస్ ప్రైజ్     డి) ఏదీకాదు
 11.    బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చిన
 
 2014 ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ విజేత?
     ఎ) పాకిస్థాన్
     బి) బంగ్లాదేశ్
     సి) శ్రీలంక    డి) భారత్
 
 12.    2014 మార్చిలో ఆంధ్రా బ్యాంకు 2000వ శాఖను ఎక్కడ ప్రారంభించింది?
     ఎ) మచిలీపట్నం     బి) హైదరాబాద్
     సి) తిరుపతి     డి) విజయవాడ
 
 13.    2014 జాతీయ స్నూకర్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
     ఎ) కమల్ చావ్లా     బి) ఆదిత్య మెహతా
     సి) పంకజ్ అద్వానీ     డి) రూపేశ్ షా
 
 14.    2014 ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత?
     ఎ) లీ చాంగ్ వీ     బి) లాంగ్ చెన్
     సి) లిన్ డాన్     డి) చెన్ జిన్
 
 15.    తెలుగు వ్యక్తి అయిన ఎన్.సాంబశివరావు ఏ ఎరువుల కంపెనీకి మేనేజింగ్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు?
     ఎ) ఇఫ్కో         బి) క్రిబ్‌కో
     సి) ఎన్‌ఎఫ్‌ఎల్     డి) ఆర్‌సీఎఫ్
 
 16.    ‘ది డిస్కవరీ ఆఫ్ ఇండియా’ పుస్తకాన్ని రచించింది?
     ఎ) మహాత్మా గాంధీ
     బి) బాలగంగాధర్ తిలక్
     సి) జవహర్‌లాల్ నెహ్రూ
     డి) బాబు రాజేంద్రప్రసాద్
 
 17.    రాళ్ల మీద పెరిగే మొక్కలను ఏమని పిలుస్తారు?
     ఎ) హాలోఫైట్స్     బి) జీరోఫైట్స్
     సి) ఎరిమోఫైట్స్     డి) లిథోఫైట్స్
 
 18.    86వ ఆస్కార్ అవార్డులలో గ్రావిటీ చిత్రానికి అత్యధిక పురస్కారాలు దక్కాయి. ఆ చిత్రం ఎన్ని ఆస్కార్లను అందుకుంది?
     ఎ) ఆరు     బి) ఏడు     సి) ఎనిమిది    డి) ఐదు
 
 19.    ఆస్కార్ అవార్డులను తొలిసారి ఏ సంవత్సరంలో ప్రదానం చేశారు?
     ఎ) 1929     బి) 1933     సి) 1932     డి) 1935


 20.    జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది?
     ఎ) అసోం         బి) మధ్యప్రదేశ్
     సి) ఉత్తరాఖండ్     డి) ఉత్తరప్రదేశ్
 
 21.    కేంద్ర సాహిత్య అకాడమీ 2014, మార్చి 12 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది?
     ఎ) 25     బి) 50     సి) 60     డి) 75
 
 22.    మిషెల్ బాచ్‌లెట్ ఏ దేశాధ్యక్షురాలిగా ఇటీవల రెండోసారి ఎన్నికయ్యారు?
     ఎ) పెరూ         బి) కోస్టారికా
     సి) బొలీవియా     డి) చిలీ
 
 23.    2014 మార్చిలో అదృశ్యమైన మలేషియా విమానం పేరు?
     ఎ) ఎమ్‌హెచ్-370     బి) ఎమ్‌హెచ్-350
     సి) ఎమ్‌హెచ్-380     డి) ఎమ్‌హెచ్-450
 
 24.    స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది?
     ఎ) చైనా         బి) పాకిస్థాన్
     సి) భారత్         డి) బంగ్లాదేశ్
 
 25.    ఎన్నికలలో చేతి వేలికి వేసే సిరాను తయారు చేసే పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ సంస్థ ఏ నగరంలో ఉంది?
     ఎ) నాగ్‌పూర్    బి) మైసూరు
     సి) పుణే         డి) కోల్‌కతా
 
 26.    2014 మార్చిలో పౌర విమానయాన ప్రదర్శన ‘ఇండియా ఏవియేషన్’ ఏ నగరంలో జరిగింది?
     ఎ) న్యూఢిల్లీ     బి) ముంబై
     సి) బెంగళూరు     డి) హైదరాబాద్
 
 27.    {పపంచంలో అతి పిన్న వయసులో అణు రియాక్టర్‌ను నిర్మించి జెమీ ఎడ్వర్డ్స్ ఏ దేశానికి చెందిన బాలుడు?
     ఎ) అమెరికా     బి) బ్రిటన్
     సి) జర్మనీ         డి) ఫ్రాన్స్
 
 28.    ఇటీవల ఏ పట్టణానికి చెందిన బావి నుంచి 1857 సైనికుల తిరుగుబాటులో మృతి చెందిన 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలను వెలికి తీశారు?
     ఎ) బర్నాలా     బి) బటాలా
     సి) పాటియాలా     డి) అజ్నాలా
 
 29.    ఇప్పటి వరకు పురుషుల విభాగంలో ట్వంటీ20 ప్రపంచ కప్ క్రికెట్ టైటిల్‌ను సాధించని జట్టు?

     ఎ) పాకిస్థాన్     బి) ఇంగ్లండ్
     సి) వెస్టిండీస్     డి) ఆస్ట్రేలియా
 
 30.    ఏ ప్రభుత్వ రంగ బ్యాంక్ ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్‌ను ప్రచారకర్తగా నియమించుకుంది?
     ఎ) విజయా బ్యాంక్
     బి) ఇండియన్ బ్యాంక్
     సి) కెనరా బ్యాంక్
     డి) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
 
 31.    ఇటీవల మరణించిన అహ్మద్ తేజన్ కబ్బా ఏ దేశానికి మాజీ అధ్యక్షుడు?
     ఎ) సియెరా లియోన్     బి) సూడాన్
     సి) లైబీరియా     డి) నైగర్
 
 32.    సాల్వడార్ శాంచెచ్ సెరెన్ ఏ దేశాధ్యక్షుడిగా 2014, జూన్ 1న బాధ్యతలు స్వీకరించారు?
     ఎ) హోండురస్     బి) క్యూబా
     సి) గ్వాటిమాలా     డి) ఎల్ సాల్వడార్
 
 33.    ఇటీవల మరణించిన మహమ్మద్ ఫాహిమ్ ఏ దేశానికి ఉపాధ్యక్షుడు?
     ఎ) అఫ్గానిస్థాన్     బి) పాకిస్థాన్
     సి) ఇరాక్         డి) సౌదీ అరేబియా
 
 34.    కింగ్‌స్టన్ నగరం ఏ దేశానికి రాజధాని?
     ఎ) నికారాగువా     బి) బహమస్
     సి) జమైకా         డి) హైతీ
 
 35.    నా అనేది ఏ నగరానికి పాత పేరు?
     ఎ) ఆమస్టర్‌డామ్     బి) ఆమ్‌స్టెల్ వీన్
     సి) ఓస్లో         డి) బెర్న్
 
 సమాధానాలు:
     1) డి;    2) ఎ;    3) సి;    4) డి;    5) ఎ;
     6) డి;    7) సి;     8) బి;     9) డి;     10) సి;
     11) సి;     12) డి;     13) సి;     14) ఎ;    15) బి;
     16) సి;    17) డి;    18) బి;    19) ఎ;    20) సి;
     21) సి;    22) డి;    23) ఎ;    24) సి;    25) బి;
     26) డి;    27) బి;    28) డి;    29) డి;    30) సి;
     31) ఎ;     32) డి;     33) ఎ;     34) సి;     35) సి.
 పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించి జీవశాస్త్రం సబ్జెక్ట్‌ను ఏవిధంగా ప్రిపేర్ కావాలి? ఏయే పుస్తకాలు చదవాలి?
 
 -రమేష్, నిజామాబాద్.
 పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో జీవశాస్త్రం నుంచి 10-15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో మన చుట్టు ఉండే మొక్కలు, జంతువులు, వాటి స్వరూపం, వర్గీకరణ, రకాలు, విస్తరణ, ప్రత్యేక లక్షణాలు, పోలికలు మొదలైన అంశాలపై ప్రధానంగా దృష్టిసారించాలి. మొక్కలు, జంతువులపై అడిగే ప్రశ్నలు కొంత మేరకు గందరగోళానికి గురి చేస్తాయి. ప్రత్యేకించి మొక్కలు, జంతువులు వాటి మధ్య పోలికలు, వర్గం గుర్తించమనే సందర్భంలో ఇటువంటి సందేహాలు ఎక్కవగా వస్తాయి. కాబట్టి వర్గీకరణ, సాధారణ లక్షణాలు, అవయవ నిర్మాణం, ఆహారపు అలవాట్లు వంటి అంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి.
 
 అప్పుడే ఇటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని సులభంగా ఇవ్వొచ్చు. మరో ప్రధాన విభాగం.. మానవ శరీర ధర్మ శాస్త్రం. ఎందుకంటే ప్రతి పోటీ పరీక్షలో ఈ అంశం నుంచి తప్పకుండా ప్రశ్నలు ఉంటున్నాయి. కాబట్టి మానవ శరీర నిర్మాణంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. జీవశాస్త్రంలో కీలకమైన అంశం.. పరిశోధనలు. ఈ అంశానికి సంబంధించి ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి జీవశాస్త్ర పరిశోధనలు, చేపట్టిన శాస్త్రవేత్తల గురించి క్షుణ్నంగా చదువుకోవాలి. పరీక్షలో ఇంటర్మీడియెట్ స్థాయి వరకు ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ప్రిపరేషన్‌ను ఇంటర్మీడియెట్ స్థాయి వరకు సాగించాలి. అంటే పదో తరగతి వరకు ఉండి ఇంటర్మీడియెట్‌లో పునరావృతమయ్యే అంశాలకు మాత్రమే ప్రిపరేషన్‌ను పరిమితం చేయాలి.
 -టి. సుధాకర్ రెడ్డి,
 సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement