'వారిద్దరూ ఓట్లకు ఎత్తుగడ వేశారు'
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీలపై సీపీఎం రాఘవులు విరుచుకుపడ్డారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ బాబు, మోడీ బీసీలను పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. బీసీలకు పెద్దపీట వేస్తున్నామంటూ ఓట్లకు ఎత్తుగడ వేస్తున్నారని విమర్శించారు. వారికి ప్రజలే బుద్ధి చెబుతారని రాఘవులు అన్నారు.