మళ్లీ వైవా! | Eligibility again! | Sakshi
Sakshi News home page

మళ్లీ వైవా!

Published Wed, Mar 19 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM

మళ్లీ వైవా!

మళ్లీ వైవా!

 శబరీశ్ కాండ్రేగుల రూపొందించిన ‘వైవా’ షార్ట్‌ఫిలిమ్ ఏ స్థాయిలో హిట్ అయ్యిందో నెటిజన్లకు చెప్పనక్కర్లేదు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రాక్టికల్స్ సమయంలో అడిగే వైవా విషయంలో స్టూడెంట్స్ పడే ఇబ్బందులను, ఎలాగోలా ఇన్విజిలేటర్లను కన్విన్స్ చేయడానికి చేసే ప్రయత్నాలను హాస్యభరితంగా రూపొందించిన ఆ షార్ట్‌ఫిలిమ్‌కు మంచి గుర్తింపు వచ్చింది.


ఇప్పటి వరకూ దాన్ని 50 లక్షలమంది వీక్షించారు. ఆ షార్ట్‌ఫిలిమ్ తో శబరీశ్ యేకంగా సెలబ్రిటీ అయిపోయాడు. ఆ స్ఫూర్తితో కొత్తగా ‘వైవా విత్ గర్ల్స్’ వచ్చింది. దాదాపు 15 నిమిషాల నిడివి ఉన్న ఈ తాజా షార్ట్‌ఫిలిమ్‌లో కొంతమంది అమ్మాయిలను ఇన్విజిలేటర్ వైవా ప్రశ్నలు అడుగుతాడు. సూర్యచంద్ర దర్శకత్వం వహించిన ఈ షార్ట్‌ఫిలిమ్‌ను అప్‌లోడ్ అయిన కొన్ని గంటల్లోనే దాదాపు లక్ష మంది చూశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement