..నా బుక్ చెబుతుంది | Suchitra Krishna murthi wrotes the Drama Queen | Sakshi
Sakshi News home page

..నా బుక్ చెబుతుంది

Published Mon, Sep 29 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM

..నా బుక్ చెబుతుంది

..నా బుక్ చెబుతుంది

చిట్‌చాట్  సుచిత్రా కృష్ణమూర్తి

గాయని, నటి, రచయిత, చిత్రకారిణి... పేరుకు ముందు ఇలా ఒకటీ కాదు రెండు కాదు అరడజనుకు పైగానే చేర్చదగిన సెలబ్రిటీ సుచిత్రా కృష్ణమూర్తి. ప్రసిద్ధ దర్శకుడు శేఖర్‌కపూర్‌కు మాజీ భార్య అయిన సుచిత్ర... రన్, మై వైఫ్స్ మర్డర్ వంటి హిందీ చిత్రాల కోసం దర్శకుడు ‘రామ్‌గోపాల్ వర్మ’తో కలిసి  పనిచేశారు. ఆ సమయంలోనే వర్మను పెళ్లి చేసుకోవాలని తాను అనుకుంటున్నట్టు సుచిత్ర ఒక మెసేజ్ పంపారు. దీనికి వర్మ.. తనకు పెళ్లి అనే వ్యవస్థ మీద నమ్మకం లేదని బదులిచ్చారట.

ఈ నేపథ్యంలో సుచిత్ర తన పుస్తకం ‘డ్రామా క్వీన్’ ద్వారా రాముతో తన పెళ్లి ప్రస్తావన సంబంధిత విషయాలను వెల్లడించి వార్తల్లో వ్యక్తిగా మారారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి నగరంలోని మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో తను గీసిన చిత్రాలతో ‘పెట్రికార్’ చిత్రప్రదర్శన ఏర్పాటు చేయడంతో పాటు డ్రామాక్వీన్ పుస్తకాన్ని విడుదల చేశారు. పలువురు సినీ, సిటీ ప్రముఖులు హాజరైన  ఈ కార్యక్రమం సందర్భంగా ‘సిటీప్లస్’తో సుచిత్ర మాట్లాడుతూ వివిధ అంశాలపై స్పందించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...
 
నగరంతో చిరకాల అనుబంధం..
హైదరాబాద్‌కు తరచూ వస్తుంటాను. ఇక్కడ  నా సోదరుడితో పాటు ఫ్రెండ్స్ ఉన్నారు. 2009లో ఇక్కడ నా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశాను. ఆ తర్వాత మళ్లీ ఇదే నా సోలో ఎగ్జిబిషన్. జీవితాన్నే స్ఫూర్తిగా తీసుకుని నేను చిత్రాలు గీస్తున్నా. ఈ ప్రదర్శన ద్వారా వచ్చిన నిధులను టాలీవుడ్ నటి సమంత సిటీ కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రత్యూష సపోర్ట్ సంస్థకు విరాళంగా అందించనున్నాను.

నో ప్లాన్స్.. ఓన్లీ యాక్షన్స్..
సింగర్, యాక్టర్, ఆర్టిస్ట్.. ఇలా నాలోని విభిన్న కోణాలను ప్రదర్శించడానికి ప్రత్యేక కారణం ఏమీ లేదు. నాకు ఎప్పుడు ఏది ఆసక్తిగా అనిపిస్తే, చేయాలని అనిపిస్తే అది చేస్తూ వెళతాను. నచ్చనిది చేయను. ఏదైనా సరే ముందుగా అనుకుని ప్లాన్ చేసి చేయడం నాకు అలవాటు లేదు. అందుకే లక్ష్యాలంటూ ఏవీ లేవు. భవిష్యత్తులో పాప్ ఆల్బమ్ రిలీజ్ చేస్తారా అని అడిగినా నా జవాబు అదే.  

వర్మతో పెళ్లి ప్రస్తావన..
రామ్‌గోపాల్ వర్మ దగ్గర నా పెళ్లి ప్రస్తావన, తను తిరస్కరించడం.. వీటన్నింటి గురించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయంలో మీ సందేహాలకు సమాధానం ఒకటే. అది. నా పుస్తకం డ్రామా క్వీన్!

..:: ఎస్.సత్యబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement