గుడ్డు కోసం వెరీగుడ్ ట్రే!
కోడిగుడ్లు బాగున్నాయో పాడయ్యాయో ఎలా తెలుస్తుంది? అది ఇప్పటికీ చాలామందికి ఉన్న కన్‌ఫ్యూజన్. ఆ కన్‌ఫ్యూజన్‌ను తీరుస్తుంది ‘ఎగ్ మైండర్ స్మార్ట్ ట్రే’. ఈ ట్రేకి ఎల్‌ఈడీ లైట్లు ఉంటాయి. గుడ్లను తీసుకుని దీనిలో పెట్టాలి. తర్వాత ఎగ్‌మైండర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆపైన యాప్ ఓపెన్ చేసి, మొబైల్‌ను ట్రే దగ్గర పెడితే... ఆ గుడ్లు బాగున్నాయో పాడైపోయాయో చెప్పేస్తుంది. ట్రేలో ఆరు గుడ్లు ఉంటాయి కదా... యాప్‌లో కూడా ఆరు గుడ్ల సింబల్ ఉంటుంది.
రెండిటినీ దగ్గర పెట్టినప్పుడు ఏ గుడ్డు ఎన్ని రోజుల పాతదో, ఏది ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో మొబైలో కనిపిస్తుంది. ఒకవేళ ఏ గుడ్డు అయినా పాడైపోతే... ఆ గుడ్డు పక్కన ఉన్న ఎల్‌ఈడీ లైటు వెలుగుతుంది. ప్రతిదీ కల్తీ అవుతున్న ఈ రోజుల్లో ఈ మాత్రం పరీక్ష చేసుకోవడం అవసరమే. అయితే ఈ ట్రేలు, యాప్ ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి. మన వరకూ రావడానికి కాస్త సమయం పట్టవచ్చు. వస్తే మాత్రం మిస్ కాకండి!