రుణమాఫీకి తగ్గిన కేటాయింపులు
హైదరాబాద్: రుణమాఫీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయింపులు తగ్గించింది. 2016-17 సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక ఆర్థిక బడ్జెట్ లో రుణమాఫీకి కేవలం రూ. 3,512 కోట్లు కేటాయించింది. గత ఏడాది పోలిస్తే ఇది చాలా తక్కువ. రెండేళ్ల కంటే కేటాయింపులు తగ్గాయి.
మిగతా రంగాలకు కేటాయింపుల్లో కోత పెట్టింది. సంస్కరణల పేరుతో విత్తమంత్రి నిధుల కేటాయింపు తగ్గించారు. విద్యుత్ రంగానికి రూ.4,020 కోట్లు విదిలించారు. గతేడాదితో పోలిస్తే రూ.3 వేల కోట్లు తగ్గించారు. భారీగా విద్యుత్ చార్జీలు పెంచుతామని సర్కారు సంకేతాలిచ్చింది. రాయితీలు తగ్గనున్నాయని పరోక్షంగా వెల్లడించింది.