సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య గులాబీ తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖాయమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సారయ్య మంగళవారం సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆయన టీఆర్ఎస్‌లో చేరుతారని కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా ముహూర్తం ఖరారు కాలేదని సోమవారం సాయంత్రం దాకా ఆయన అనుచరులు చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడం దాదాపు ఖాయమైందని తెలుస్తోంది.