ఉత్తమ నటుడు నరేష్
భరతముని సినీ పురస్కారాల ప్రకటన
ఈనెల 14న ప్రదానోత్సవం
నాంపల్లి: భరతముని 27వ సినీ పురస్కారాల ప్రదానోత్సవం ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు రొమ్మల ముని కృష్ణారెడ్డి తెలిపారు. ఈ వేడుకల్లో దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు, సమాచార హక్కు చట్టం కమిషనర్ పి. విజయబాబు, నిర్మాత అంబికా కృష్ణ, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి పివి. నాయుడు, డాక్టర్ బివి పట్టాభిరామ్ అతిథులుగా పాల్గొంటారన్నారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ‘చదువుకోవాలి’ సినిమా దర్శక నిర్మాత మద్దాలి వెంకటేశ్వరరావు, ప్రియా ప్రేమలో ప్రేమ నిర్మాత సి.సిద్ధేశ్వర మనోజ్‌లను ప్రత్యేకంగా సన్మానిస్తున్నట్లు కృష్ణారెడ్డి పేర్కొన్నారు.
పురస్కార గ్రహీతలు వీరే..
ఉత్తమ నటీనటులుగా శ్రీదివ్య(మల్లెల తీర్థంలో సిరిమల్లెపువ్వు), నరేష్ (రఘుపతి వెంకయ్య నాయుడు), ఉత్తమ హాస్య నటుడుగా డాక్టర్ బ్రహ్మానందం(మిర్చి), ఉత్తమ ప్రతి నాయకుడుగా జయప్రకాష్‌రెడ్డి(నాయక్), ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా తనికెళ్ల భరణి(జగద్గురు ఆది శంకరాచార్య), ఉత్తమ క్యారెక్టర్ నటిగా నదియా(అత్తారింటికి దారేది), ఉత్తమ సామాజిక ప్రభోదాత్మక చిత్రంగా జగద్గురు ఆదిశంకరాచార్య, ఉత్తమ సందేశాత్మక చిత్రంగా రఘుపతి వెంకయ్య నాయుడు, ఉత్తమ హాస్య చిత్రంగా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా అత్తారింటికి దారేది, ఉత్తమ సంభాషణల రచయితగా జె.కె.భారవి(జగద్గురు ఆది శంకరాచార్య), ఉత్తమ గాయనీ గాయకులుగా ప్రణవి, ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్(అత్తారింటికి దారేది) ఎంపి కయ్యారు.