బతుకమ్మ, దసరా, బక్రీద్ పండుగలకు కలిపి15 రోజులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ, దసరా, బక్రీద్ పండుగలకు 15 రోజులు, సంక్రాంతి పండుగకు 5 రోజులు సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యా కమిషనర్ జగదీశ్వర్ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఈనెల 23 నుంచి వచ్చేనెల 5వ తేదీవరకు బతుకమ్మ, దసరా, బక్రీద్ సెలవులుండగా, ఇపుడు రెండురోజులు పెంచి, 7వ తేదీ వరకు సెలవులుగా పాటించాలన్నారు. అలాగే, వచ్చే ఏడాది జనవరి 10వ తేదీనుంచి 18వ తేదీవరకు ఉన్న సంక్రాంతి సెలవుల్ని మూడురోజులు తగ్గించి 15వ తేదీ వరకే పాటించాలని ఆర్‌సీ నంబరు జేడీఎస్/ప్లానింగ్/2014 ద్వారా ఉత్తర్వులు జారీ చే సినట్లు ఎస్టీయూటీఎస్, టీపీపీటీఏ సంఘాలు వెల్లడించాయి. ఈ సెలవు దినాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే పాఠశాల విద్యా క్యాలెండర్‌లోనూ ఇందుకనుగుణంగా మార్పులు చేయాలని జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
పాఠశాలలకు 5 రోజులు సంక్రాంతి సెలవులు
Published Fri, Sep 26 2014 12:08 AM | Last Updated on Fri, Jul 6 2018 3:36 PM
Advertisement
Advertisement