సివిల్ సర్జన్లకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: స్థానికత ఆధారంగా ప్రభుత్వం బదిలీ చేసిన సివిల్ సర్జన్లకు హైకోర్టులో ఉరట లభించింది. తమ బదిలీలను వెంటనే నిలిపివేయాలంటూ వారు పెట్టుకున్న పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా వాదనలు విన్న న్యాయస్థానం వైద్యుల ట్రాన్స్‌ఫర్లను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 10వ తరగతి ఎక్కడ చదివారో అక్కడ స్థానికతగా పరిగణించాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ నుంచి 45 మందిని ఏపీకి, ముగ్గురిని ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించింది.