ఎమ్మెల్సీ రామచంద్రరావుకు సతీవియోగం
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీకి చెందిన శాసనమండలి సభ్యుడు రామచంద్రరావు సతీమణి సావిత్రి(54) సోమవారం ఉదయం మృతిచెందారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తార్నాకలోని స‍్వగృహంలో సోమవారం ఉదయం మృతిచెందారు. సావిత్రి మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.