కెల్విన్‌తో సాన్నిహిత్యం ఏంటి?
సినీ నటుడు నవదీప్‌పై సిట్ ప్రశ్నల వర్షం
- మాదాపూర్‌లోని పబ్‌లో మీకు పార్ట్‌నర్‌షిప్ ఉందా?
- అందులో డ్రగ్స్ దందా నడుస్తోందా?
- ఆ పబ్ తనది కాదని, కేవలం ఈవెంట్లు చేస్తానన్న నవదీప్
- కెల్విన్ ఈవెంట్ మేనేజర్‌గానే తెలుసునని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న కెల్విన్‌తో మీకు సంబందం ఏంటి? అసలు కెల్విన్ ఎలా పరిచయమ య్యాడు? ఎందుకు నిత్యం మీ ఇద్దరి మధ్య కాల్స్ నడిచాయి? ఎందుకింతలా సన్నిహి తంగా వ్యవహరించారు?.... సినీ నటుడు నవదీప్‌పై సిట్ అధికారుల ప్రశ్నల వర్షం ఇదీ! డ్రగ్స్ కేసు ఐదోరోజు విచారణలో భాగంగా సోమవారం నవదీప్‌ను సిట్ విచారించింది. నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాల యంలో ఉదయం 10.30 నుంచి రాత్రి 9.50 వరకు అధికారులు ఆయన్ను ప్రశ్నించారు.
పబ్బుల నిర్వహణ నిజమేనా?
పబ్బుల నిర్వహణపై సిట్ అధికారులు నవ దీప్‌ను ప్రశ్నించినట్టు తెలిసింది. ‘మాదాపూ ర్‌లోని ఓ పబ్‌లో మీకు పార్ట్‌నర్‌షిప్ ఉందా? అందులో డ్రగ్స్ దందా నడుస్తోందా? ప్రతి వీకెండ్‌లో సినీ ప్రముఖులకు ఆతిథ్యం ఇస్తారా’ అని ప్రశ్నించగా... తనకు పబ్ ఉంద ని వస్తున్న వార్తల్లో నిజం లేదని నవదీప్ చెప్పి నట్టు సమాచారం. ఆ పబ్ తన స్నేహితుల దని, తాను కేవలం ఈవెంట్లు మాత్రమే చేస్తా నని చెప్పినట్టు తెలుస్తోంది. అలా అయితే కెల్విన్‌తో పరిచయం ఏంటి అని అధికారులు ప్రశ్నించారు. తాను సినీ ప్రముఖులతోపాటు ఇతరులకు ఈవెంట్లు చేస్తానని, అందువల్ల ఈవెంట్‌మేనేజర్ అయిన కెల్విన్‌తో పరిచయం ఏర్పడిందని నవదీప్ వివరించినట్టు తెలిసింది.
మీరు కెల్విన్ నుంచి డ్రగ్స్ తీసుకు న్నట్టు ఆధారాలున్నాయని అధికారులు అనగా.. తనకు డ్రగ్స్ అలవాటు లేదని ఆయన స్పష్టంచేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా కెల్విన్‌తో ఫొటోలు, కాల్‌డేటా, వాట్సాప్‌లో డ్రగ్స్‌కు సంబంధించిన మెసే జ్‌లను అధికారులు నవదీప్‌కు చూపించినట్టు తెలిసింది. అయితే ఈవెంట్ల వరకు మాత్రమే తనకు కెల్విన్‌తో సాన్నిహిత్యం ఉందని, అంతకుమించి వేరే వ్యవహారాల్లో సంబంధం లేదని ఆయన చెప్పినట్టు సమాచారం.
హుషారుగా వచ్చి.. ముభావంగా...
ఉదయం 10.30 గంటలకు సిట్ విచారణకు హాజరైన నటుడు నవదీప్ మధ్యాహ్నం వరకు హుషారుగా ఉన్నారని, ఆ తర్వాత ముభా వంగా మారిపోయారని సిట్ వర్గాలు తెలి పాయి. కెల్విన్‌తో దిగిన ఫొటోలు, ఇతర ప్రముఖులకు అతడిని పరిచయం చేసిన వివ రాలను ముందుంచడంతో మౌనంగా ఉండి పోయారని తెలిసింది. ‘ప్రముఖ హీరోలతో మీకు సాన్నిహిత్యం ఉంది. వారికి కూడా డ్రగ్స్ అలవాటు చేసినట్టు ఆరోపణలు వినిపి స్తున్నాయి. దీనిపై ఏమంటారు’ అని సిట్ ప్రశ్నించగా.. వాటన్నింటినీ నవదీప్ తోసి పుచ్చినట్టు సమాచారం. రక్త నమూనాలు ఇవ్వడానికి నవదీప్ నిరాకరించారు. కోర్టు ఆదేశాలుంటేనే ఇస్తానని తెలిపారు. మంగళ వారం ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను విచారిస్తారు.
డీజీపీతో అకున్ భేటీ
డీజీపీ అనురాగ్ శర్మతో సోమవారం సాయంత్రం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ భేటీ అయ్యారు. డ్రగ్స్ కేసులో ఎలా ముందుకెళ్లాలి? చార్మి హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఎలాంటి కౌంటర్ దాఖలు చేయాలన్న అంశంపై డీజీపీతో చర్చించినట్టు తెలుస్తోంది. కేసు మరింత లోతుకు పోయేకొద్దీ ఎలా విచారణ చేయాలి? అందుకు సిట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దర్యాప్తులో మెలకువలపై డీజీపీ సూచనలు, సలహాలు అందించారని సమాచారం. అలాగే తనకు వచ్చిన బెదిరింపు కాల్స్‌పై అకున్ సబర్వాల్ వివరాలు అందజేసినట్టు తెలిసింది. ఈ భేటీలో నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్‌చంద్ పాల్గొన్నారు.