బదిలీ సరే.. విధుల మాటేంటి?
Published Mon, Jul 3 2017 1:07 AM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM
- ఒక్క ఉత్తర్వుతో 200 మంది వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల బదిలీ
- పని అప్పగించని ప్రభుత్వం.. ఖాళీగా 200 మంది..
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ అమలు నేపథ్యంలో తమ శాఖను పునర్‌వ్యవస్థీకరించాలని వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది డిమాండ్ చేస్తుంటే.. ఉన్న సిబ్బందికి కూడా పని లేకుం డా చేశారు ఆ శాఖ ఉన్నతాధికారులు. దేశ వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా శనివారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమీకృత, సరిహద్దు చెక్‌పోస్టుల్లో పని చేస్తున్న 200 మందికిపైగా సిబ్బందిని బదిలీ చేసిన ప్రభుత్వం.. వారికి పని బాధ్యతలు అప్పగించడాన్ని మర్చిపోయింది. దీంతో మూసివేసిన చెక్‌పోస్టుల్లో విధులు నిర్వర్తించిన సిబ్బంది ఏం చేయాలన్నది ప్రశార్థకంగా మారింది.
ఏడు రోజుల క్రితమే నిర్ణయం
చెక్‌పోస్టులను మూసివేయాలని గత నెల 23న వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సమక్షంలో జరిగిన సమావేశంలో నిర్ణయిం చారు. కానీ ఏడు రోజుల తర్వాత కూడా ఆ సిబ్బందికి విధులు అప్పగించడం చేయలేదు. దీంతో శనివారం రిపోర్టు చేయడానికి హైదరాబాద్ రూరల్, వరంగల్ నోడల్ డివి జన్ కార్యాలయాలకు వచ్చిన చెక్‌పోస్టు సిబ్బందికి విధులు అప్పగించలేదు. ఇందులో 10 మందికి పైగా ఉప వాణిజ్య పన్నుల అధి కారులు (డీసీటీవో), 40 మందికి పైగా సహా య వాణిజ్య పన్నుల అధికారులు (ఏసీటీవో) ఉండటం గమనార్హం.
కుర్చీల్లేవ్.. ఖాళీల్లేవ్..!
రాష్ట్రవ్యాప్తంగా 90 సర్కిళ్లలో చాలాచోట్ల సరిపడా సిబ్బంది లేకపోగా, సిబ్బంది ఉన్న చోట కూడా పని ఒత్తిడి ఎక్కువవుతోంది. దీంతో క్లర్కులు, అటెండర్లను మినహాయించి డీసీటీవో, ఏసీటీవోలకైనా బాధ్యతలు అప్ప గిస్తే బాగుంటుందని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. మరోవైపు బదిలీపై వచ్చిన సిబ్బంది కూర్చునేందుకు కుర్చీలు, ఆయా కార్యాలయాల్లో ఖాళీలు లేకపోవడం గమనార్హం. ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల చెక్‌పోస్టుల వద్ద రూ. లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు, అక్కడి చెక్‌పోస్టుల్లో ఉన్న కంప్యూటర్లు, కుర్చీలు, బల్లలను తెప్పించుకోవడంలో కూడా ఉన్నతాధికారులు విఫలమయ్యారు.
Advertisement
Advertisement