హైదరాబాద్: నగరంలోని సచివాలయంలో తాము ఉపయోగించుకుంటున్న బ్లాకులను ఖాళీ చేస్తున్నట్టు వస్తున్న కథనాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండించింది. సెక్రటేరియట్‌ను ఖాళీ చేయడం లేదని స్పష్టం చేసింది.
సెక్రటేరియట్‌లోని ఏపీ ప్రభుత్వం వినియోగించుకుంటున్న పలు బ్లాకులను ఈ నెల 27లోపు ఖాళీ చేస్తున్నామని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఆంధ్ర ప్రభుత్వం లేఖ రాసినట్టు కొన్ని చానెళ్లలో కథనాలు వచ్చాయి. ఈ కథనాలు నిరాధారమని, సెక్రటేరియట్ ఖాళీ చేస్తున్నట్టు తాము ఎలాంటి లేఖ రాయలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఓ ప్రకటనలో తెలిపారు.
'సెక్రటేరియట్ ను ఖాళీ చేయడం లేదు'
Published Thu, Jun 9 2016 11:03 PM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM
Advertisement
Advertisement