వైఎస్ జగన్ సంతాపం | ys jagan mohan reddy offer condolence to Kolkata flyover collapse victims | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ సంతాపం

Published Fri, Apr 1 2016 1:13 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

వైఎస్ జగన్ సంతాపం - Sakshi

వైఎస్ జగన్ సంతాపం

హైదరాబాద్: కోల్ కతా ఫ్లైఓవర్ మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు శుక్రవారం తన ట్విటర్ పేజీలో పోస్ట్ చేశారు.

గురువారం కోల్ కతాలోని బుర్రాబజార్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలడంతో 24 మంది మరణించారు. 88 మంది గాయపడగా వారికి నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలంలో సహాయక కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement