భారత్‌ చెబితే ఉత్తర కొరియా వింటుంది: అమెరికా | India can help in resolving North Korea nuclear crisis: US commander | Sakshi
Sakshi News home page

భారత్‌ చెబితే ఉత్తర కొరియా వింటుంది: అమెరికా

Published Sat, Aug 12 2017 5:26 PM | Last Updated on Sun, Sep 17 2017 5:27 PM

భారత్‌ చెబితే ఉత్తర కొరియా వింటుంది: అమెరికా

భారత్‌ చెబితే ఉత్తర కొరియా వింటుంది: అమెరికా

న్యూయార్క్‌: ఉత్తర కొరియా అణు సంక్షోభ సమస్యను భారత్‌ తీర్చగలదని అమెరికాకు చెందిన ఉన్నత శ్రేణి కమాండర్‌ అడ్మిరల్‌ హ్యారీ హ్యారీస్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. మిగితా దేశాలతో పోలిస్తే భారత్‌ది చాలా బలమైన గొంతు అని, సమస్యను చాలా చక్కగా వివరించగల సొత్తు భారత్‌ సొంతమని ఆయన తెలిపారు.

'భారత్‌ది చాలా పెద్ద స్వరం అని నేను అనుకుంటున్నాను. భారత్‌ స్వరాన్ని ప్రజలు వింటారు. ఉత్తర కొరియా విషయంలో భారత్‌ సహాయం చేయగలదు. ఉత్తర కొరియా చేస్తున్న పనులు ఎంత ప్రమాదకరమైనవని అమెరికా భావిస్తుందో అదే విషయాన్ని భారత్ మరింత స్పష్టంగా ఉత్తర కొరియాకు అదే విదంగా ప్రపంచానికి చెప్పగలదు' అని ఆయన అన్నారు. ఈ విషయంలో భారత్‌ ఎలాంటి పాత్ర పోషించాలనుకుంటుందో ఆ దేశమే నిర్ణయించుకోవాలని చెప్పారు. గత నెలలో రెండు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిన అనంతరం అమెరికా ఉత్తర కొరియా మధ్య తీవ్ర వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement