11 నిమిషాల్లో లండన్ నుంచి న్యూయార్క్కు | London to New York in 11 minutes | Sakshi
Sakshi News home page

11 నిమిషాల్లో లండన్ నుంచి న్యూయార్క్కు

Published Fri, Jan 29 2016 12:51 PM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

11 నిమిషాల్లో లండన్ నుంచి న్యూయార్క్కు - Sakshi

11 నిమిషాల్లో లండన్ నుంచి న్యూయార్క్కు

సాధారణంగా లండన్ నుంచి న్యూయార్క్ చేరుకోవడానికి సాధారణంగా ఎనిమిది గంటలు పడుతుంది. అయితే మీరు మాత్రం ఇప్పుడు కేవలం 11 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఈ వార్తను నమ్మలేకపోతున్నారా? నిజమేనండి. స్క్రీమర్ను మించిన హైపర్ సోనిక్ విమానం వచ్చేస్తోంది. స్ర్కీమర్ కంటే రెట్టింపు వేగంతో దూసుకుపోయే  హైపర్ సోనిక్ విమానం వచ్చేస్తోంది.

 

గత ఏడాది నవంబర్లో  స్ర్కీమర్తో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన కెనెడా ఇంజినీర్ ఛార్లెస్ బంబార్డియర్ సంస్థే ఈ విమానాన్ని రూపొందించింది.  దీంతో లండన్ నుంచి న్యూయార్క్కు కేవలం పదకొండు నిమిషాల్లో  ల్యాండ్ అవ్వొచ్చు. ఈ విషయాన్ని బంబార్డియన్ తన అధికారిక వెబ్సైట్లో తెలిపింది.  20 వేల కిలోమీటర్ల వేగాన్ని కేవలం గంట వ్యవధి లోపు లోనే చేరుకోవచ్చని ఇంజనీర్ చార్లెస్ బంబార్డియర్  ఘంటా పథంగా చెబుతున్నారు.

స్క్రీమర్‌ విమానం కంటే ఇది రెట్టింపు వేగంతో ప్రయాణించగలదని చెబుతున్నారు. దీంతోపాటుగా  యుద్ధ విమానాల కంటే  దాదాపు 12 రెట్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. 10 మంది ఈ విమానంలో ప్రయాణించే సౌకర్యం అందుబాటులో  ఉంటుందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడికైనా, ఏ సమయంలో అయినా లక్ష్యాన్ని అతి త్వరలో చేరుకునేందుకు  మిలిటరీ అధికారులకు ఇది బాగా ఉపయోగపడుతుందని బంబార్డియర్  తెలిపారు.

కాగా గత ఏడాది  ఇంజినీర్ ఛార్లెస్ బంబార్డియర్ ఆధ్వర్యంలో స్క్రీమర్  విమానం గంటకు ఏకంగా 7673 మైళ్ల వేగంతో దూసుకెళ్లేలా డిజైన్ చేసిన సంగతి తెలిసిందే.  75 మంది ప్రయాణించే  సామర్ధ్యం కలిగిన ఈ స్క్రీమర్ నాలుగు వేల మైళ్ల అట్లాంటిక్ మహా సముద్రాన్ని అరగంటలో  అధిగమిస్తుందని అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement