బాత్రూమ్‌కు వెళ్లాలంటే ఫొటో దిగాల్సిందే! | photo must taken at temple of heaven in china | Sakshi
Sakshi News home page

బాత్రూమ్‌కు వెళ్లాలంటే ఫొటో దిగాల్సిందే!

Published Sun, Mar 19 2017 10:13 PM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

బాత్రూమ్‌కు వెళ్లాలంటే ఫొటో దిగాల్సిందే! - Sakshi

బాత్రూమ్‌కు వెళ్లాలంటే ఫొటో దిగాల్సిందే!

బీజింగ్‌: చౌకగా వస్తువుల్ని తయారుచేయడంలో నిష్ణాతులైన చైనీయులు చోరకళలోనూ ఆరితేరిపోయారనడానికి తాజా ఉదాహరణ ఇది. గత కొద్దికాలంగా బీజింగ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన టెంపుల్‌ ఆఫ్‌ హెవెన్‌లో టాయిలెట్‌ పేపర్లు మాయమవుతున్నాయట. ఎంట్రా అని ఆరాతీస్తే చుట్టుపక్కల ఉండే స్థానికులే వాటిని ఇంట్లో వాడుకోవడానికి ఎత్తుకెళ్లిపోతున్నారని తెలిసింది. దీంతో కంగుతున్న అధికారులు వెంటనే ముఖాల్ని గుర్తించి టాయిలెట్‌ పేపర్‌ను జారీ చేసే యంత్రాన్ని అమర్చారు.

బాత్రూమ్‌కు వెళ్లేవారు ముందుగా ఈ మెషీన్‌లోని హెచ్‌డీ కెమెరా ముందు ఫొటో దిగాలి. అప్పుడే టాయిలెట్‌ పేపర్‌ బయటకు వస్తుంది. కెమెరాలో అమర్చిన సాఫ్ట్‌వేర్‌ ముఖాలను నిర్ణీత సమయం వరకూ గుర్తుపెట్టుకుంటుంది. ఒకసారి వచ్చిన వాళ్లు మళ్లీమళ్లీ బాత్రూమ్‌కు వస్తే వారిని కెమెరా గుర్తించి టాయిలెట్‌ పేపర్‌ను జారీ చేయదు. ఈ తతంగానికి కనీసం 3 సెకన్ల నుంచి ఒక నిమిషం వరకూ సమయం పడుతుందట. ఈ దొంగతనాలపై స్థానిక మీడియా చేసిన పరిశోధనలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. టాయిలెట్‌ పేపర్లను దొంగలించేవారిలో వృద్ధులే అధికమట. మరోవైపు అధికారుల నిర్ణయానికి సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement