రోడ్డు ప్రమాదంలో యువనటుడి మృతి | star trek young artist anton yelchin dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువనటుడి మృతి

Published Mon, Jun 20 2016 8:06 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

రోడ్డు ప్రమాదంలో యువనటుడి మృతి - Sakshi

రోడ్డు ప్రమాదంలో యువనటుడి మృతి

'స్టార్ ట్రెక్' సినిమాల సిరీస్‌లో 'చెకోవ్' పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్న యువ నటుడు ఆంటోన్ యెల్షిన్ (27) రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషయాన్ని అతడి పబ్లిసిస్ట్ జెన్నిఫర్ అలెన్ నిర్ధారించారు. ముందుగా టీవీ షోలు, చిన్న చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించిన యెల్షిన్, ఆ తర్వాత ఆల్ఫా డాగ్ లాంటి క్రైం థ్రిల్లర్ సినిమాలతో మంచి బ్రేక్ సాధించాడు. ఆపై చారీ బార్ట్‌లెట్ లాంటి టీనేజ్ కామెడీ సినిమాలు కూడా చేశాడు. జూలై నెలలో విడుదల కావాల్సి ఉన్న స్టార్ ట్రెక్ సినిమాలో స్టార్ ట్రెక్ బియాండ్ (మూడో సిరీస్)లో మంచి పాత్ర లభించింది.

యెల్షిన్ రష్యాలో జన్మించాడు. ఇతడు తన తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. వాళ్లిద్దరూ కూడా ప్రొఫెషనల్ ఫిగర్ స్కేటర్లు. యెల్షిన్ చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే వాళ్ల కుటుంబం అమెరికాకు తరలిపోయింది. రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది.. ఆ సమయంలో ఏమైందన్న విషయాలపై మాత్రం దయచేసి ఏమీ అడగొద్దని యెల్షిన్ తల్లిదండ్రులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement