గురుశోచ్ కౌర్
న్యూయార్క్ : తలపాగా ధరించిన ఓ సిక్కు మహిళ మొదటిసారిగా న్యూయార్క్ పోలీస్ విభాగంలో చేరనున్నారు. గురుశోచ్ కౌర్ అనే సిక్కు మహిళ తొలిసారిగా ఈ ఘనత సాధించారు. న్యూయార్క్ సిటీ పోలీస్ అకాడమీలో గతవారం డిగ్రీ పూర్తి చేసుకున్న ఆమె పోలీసు సహాయక అధికారిణిగా న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరనున్నారు. ‘‘గురుశోచ్ కౌర్‌ను న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి ఆహ్వానించటం చాలా గర్వంగా ఉంది. మిగిలిన వారికి కూడా అభినందనలు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. క్షేమంగా ఉండాల’’ని సిక్క్ ఆఫీసర్స్ అసోషియేషన్ ట్విటర్ లో పేర్కొంది.
యూఎస్ ప్రజలు సిక్కిజాన్ని అర్థం చేసుకునే విధంగా గురుశోచ్ కౌర్ మార్పుతేవాలని ‘మినిష్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్’ హరదీప్ సింగ్ పూరి కోరారు. ఆయన 2010లో తనకు జరిగిన అవమానాన్ని, ఈ మధ్యనే కెనాడా మంత్రి నవదీప్ బేన్స్‌కు జరిగిన అవమానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సిక్కులు సామరస్యానికి రాయబారులని అన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment