వైరల్‌: గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్‌ చేయడానికి వెళ్తూ.. | US Man Falls Into Lake Right Before Proposing To Girlfriend | Sakshi
Sakshi News home page

వైరల్‌: గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్‌ చేయడానికి వెళ్తూ..

Published Fri, Jul 10 2020 12:31 PM | Last Updated on Fri, Jul 10 2020 1:07 PM

US Man Falls Into Lake Right Before Proposing To Girlfriend - Sakshi

వాషింగ్టన్‌: తమ స్నేహితురాలికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా తమ ప్రేమను ప్రత్యేకంగా వ్యక్తం చేయాలనుకుంటారు అబ్బాయిలు. అదే విధంగా అమెరికాకు చెందిన జాక్సన్‌ కూడా తన గర్ల్‌ఫ్రెండ్‌ మరియా గుగ్లోట్టాకు వినూత్నంగా ప్రపోజ్‌ చేసి మధర జ్ఞాపకంగా మలచుకోవాలనుకున్నాడు. ఇందుకోసం తన స్నేహితురాలిని ఆమెరికాలోని మిచిగాన్‌ సరస్సు వద్దకు తీసుకెళ్లాడు. తనకు ప్రపోజ్‌ చేస్తూ సరస్సులో జారిపడ్డ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందుకు సంబంధించి వీడియోను మరియా తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. (చదవండి: ఈ బుడ్డోడు నిజంగా సూప‌ర్‌)

ఈ వీడియోలో మరియా  సరస్సు  ఒడ్డున నిలుచుని ఉంది. దీంతో జాక్సన్‌ తనకు రింగు తొడిగి ప్రపోజ్‌ చేసేందుకు తనవైపు నడుస్తూ ఉండగా అల తన కాలుని తాకడంతో జారిపడ్డాడు. ఆ తర్వాత లేచి మోకాళ్లపై నిలుచుని తనకు రింగ్‌ తోడిగి ప్రపోజ్‌ చేశాడు. ఈ  వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్‌, వందల్లో కామెంట్స్‌ వస్తున్నాయి. ‘ఇది ఎప్పటికి గుర్తుండిపోయే సంఘటన’, ‘ఇది అద్భుతం’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement