మేషం : మీ ప్రేమ ప్రతిపాదనలు అత్యంత ఇష్టులైన వారికి అందించేందుకు ఆది, సోమవారాలు అనుకూలమైనవి. ఈ రోజుల్లో మీ మనస్సులోని భావాలను వెల్లడిస్తే ఆవతలి నుంచి కూడా సానుకూల స్పందన రావచ్చు. ప్రేమ ప్రతిపాదనల సమయంలో మీరు వైట్, బ్లూ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి ఉత్తర దిశగా బయలుదేరండి. ఇక శుక్ర, మంగళవారాలు వ్యతిరేకమైనవి.
వృషభం : మీరు ఇష్టపడే వ్యక్తులకు ప్రేమసందేశాలు అందించేందుకు శుక్ర, గురువారాలు అనుకూలం. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలపై ఆవతలి వైపు నుంచి సుముఖత వ్యక్తమయ్యే అవకాశాలుంటాయి. ప్రపోజ్ చేయటానికి వెళుతున్న సమయంలో రెడ్, గ్రీన్‌రంగు దుస్తులు ధరిస్తే ఫలితం ఉంటుంది. ప్రేమకు సంబంధించిన పనులు మొదలు పెట్టే సమయంలో ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరండి. అయితే సోమ, మంగళవారాలలో ఇటువంటి వాటికి దూరంగా ఉండండి.
మిథునం : శుక్ర, సోమవారాలు మీ మనోభీష్టాన్ని అత్యంత ఇష్టపడే వారికి వెల్లడించేందుకు అనువైన కాలం. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలకు సానుకూల స్పందనలు వచ్చే వీలుంది. అలాగే, ఈ రోజుల్లో పింక్, స్కైబ్లూ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. బుధ, గురువారాలు మాత్రం మౌనం వహించడం ఉత్తమం.
కర్కాటకం : మీ ప్రేమసందేశాలు, వివాహ ప్రతిపాదనలు తెలిపేందుకు ఆది, బుధవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈ రోజుల్లో చేసే ప్రతిపాదనలకు ఆవతలి నుంచి సైతం ఆమోదముద్ర పడవచ్చు. ప్రపోజ్ చేసే సమయంలో వైట్, ఎల్లో రంగు దుస్తులు ధరించండి. ప్రేమకు సంబంధించిన పనులు మొదలుపెట్టేటప్పడు పశ్చిమవాయువ్య దిశగా ఇంటి నుంచి బయలుదేరితే శుభం చేకూరుతుంది. ఇక శుక్ర, శనివారాలు మాత్రం ఇటువంటి వాటికి దూరంగా ఉండండి.
సింహం : మీ మనస్సులోని భావాలు, ప్రతిపాదనలు మీ ప్రియమైన వారికి అందించేందుకు బుధ, గురువారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో చేసే ప్రతిపాదనలకు ఆవతలివారి నుంచి సానుకూలత వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమను వ్యక్తపరచటానికి వెళుతుంటే లైట్‌పింక్, వైట్‌రంగు దుస్తులు ధరించండి. అలాగే, ఇంటి నుంచి ఉత్తర ఈశాన్యదిశగా బయలుదేరండి. అయితే శుక్ర, మంగళవారాలు మీ ప్రతిపాదనలను మనస్సులోనే ఉంచుకోండి.
కన్య : ఇష్టమైన వ్యక్తులకు మీ ప్రతిపాదనలు, అభిప్రాయాలను వెల్లడించేందుకు శుక్ర, ఆదివారాలు అనుకూలమైనవి. ఈరోజులలో మీరు చేసే ప్రేమ ప్రతిపాదనలు ఆవతలి వారు ఆమోదించే వీలుంటుంది. ఇటువంటి సమయంలో మీరు గ్రీన్, ఎల్లో రంగు దుస్తులు ధరించండి. ఇక ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరితే ఫలితం ఉంటుంది. అయితే సోమ, గురువారాలు వ్యతిరేకమైనవి కావడం వల్ల మౌనం ఉత్తమం.
తుల : మీ మనస్సులోని అభిప్రాయాలను మీ ప్రియమైన వారికి తెలిపేందుకు శని, సోమవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈరోజుల్లో చేసే ప్రతిపాదనలు ఆవతలి వారు అంగీకరించే అవకాశం ఉంది. ఈ రోజుల్లో మీరు బ్లూ, పింక్‌రంగు దుస్తులు ధరించండి. ఇక పశ్చిమ వాయువ్య దిశగా ఇంటి నుంచి బయలుదేరండి. ఇక బుధ, గురువారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి.
వృశ్చికం : మీరు ఇష్టపడే వ్యక్తులకు ప్రేమ సందేశాలు, పెళ్లి ప్రతిపాదనలు చేసేందుకు ఆది, బుధవారాలు అనుకూలమైనవి. ఈ రోజుల్లో అందించే మీ సందేశాలకు ఆవతలి నుంచి కూడా అనుకూల స్పందనలు రావచ్చు. ప్రపోజ్ చేసే సమయంలో రెడ్, పింక్‌రంగు దుస్తులు ధరించండి. ఇక ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరండి. అయితే ఇటువంటి ప్రయత్నాలకు శుక్ర, శనివారాలు అనుకూలం కాదు.
ధనుస్సు : మీ ప్రియమైన వారికి ప్రేమ ప్రతిపాదనలు అందించేందుకు బుధ, గురువారాలు అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో చేసే ప్రతిపాదనలు ఆవతలి వారు ఆమోదించే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమయంలో మీరు వైట్, సిమెంట్‌రంగు దుస్తులు ధరించండి. ప్రేమ వ్యవహారాలు మొదలుపెట్టే సమయంలో ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. శని, మంగళవారాలు ఇటువంటి వాటికి మరింత దూరంగా ఉండడం మంచిది.
మకరం : శుక్ర, శనివారాలు మీ అభిప్రాయాలను ఇష్టమైన వ్యక్తులకు తెలియజేసేందుకు అనుకూలమైనవి. ఈ రోజుల్లో మీ ప్రేమ ప్రయత్నాలకు ఆవతలి నుంచి కూడా సహకారం అందే అవకాశం ఉంటుంది. ప్రపోజ్ చేసే సమయంలో మీరు బ్లూ, పింక్‌రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, పశ్చిమ దిశగా ఇంటి నుంచి బయలుదేరితే మంచిది. అయితే ఇటువంటి ప్రతిపాదనలకు ఆది, బుధవారాలు దూరంగా ఉండండి.
కుంభం : మీ మనోభీష్టాన్ని అత్యంత ఇష్టమైన వారికి తెలిపేందుకు ఆది, సోమవారాలు అనుకూలమైనవి. ఈ రోజులలో చేసే ప్రతిపాదనలకు ఆవతలి వైపు నుంచి కూడా సానుకూల స్పందనలు రావచ్చు. ఇటువంటి సమయంలో మీరు వైట్, గ్రీన్‌రంగు దుస్తులు ధరించండి. ఇక ఉత్తరదిశగా ఇంటి నుంచి బయలుదేరితే శుభదాయకంగా ఉంటుంది. అయితే వీటికి శని, మంగళవారాలు దూరంగా ఉండండి.
మీనం : మీ ప్రేమసందేశాలు, పెళ్లి ప్రతిపాదనలు ఇష్టులకు అందించాలనుకుంటే శుక్ర, బుధవారాలు అనుకూలం. ఈ రోజుల్లో మీరు చేసే ప్రేమ ప్రతిపాదనలను ఆవతలి వ్యక్తులు ఆమోదించే వీలుంటుంది. ప్రపోజ్ చేసే సమయంలో మీరు రెడ్, పింక్‌రంగు దుస్తులు ధరించండి. ప్రేమ ప్రయత్నాలు మొదలుపెట్టడానికి ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరితే అనుకూల ఫలితాలు రావచ్చు. ఇక ఆది, సోమవారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment