ప్రేమలో ఉన్నారా.. ఈ వారం మీ జాతకం తెలుసుకోండి! | Weekly Love Horoscope Telugu | Sakshi
Sakshi News home page

ప్రేమజాతకం 27-12-19 నుంచి 02-01-20 వరకు

Published Fri, Dec 27 2019 11:16 AM | Last Updated on Fri, Dec 27 2019 5:03 PM

Weekly Love Horoscope Telugu - Sakshi

మేషం : మీ ప్రతిపాదనలు ఇష్టమైన వ్యక్తులకు అందించేందుకు శుక్ర, మంగళవారాలు అనుకూలం. ఈ రోజుల్లో మీ అభిప్రాయాలకు ఆవతలి వారు కూడా అనుకూలంగా స్పందించే వీలుంటుంది. ఇక  ప్రేమ ప్రతిపాదనలు చేసే సమయంలో రెడ్, వైట్‌ రంగు దుస్తులు ధరించండి. అలాగే ప్రేమకు సంబంధించిన పనులు మొదలుపెట్టే సమయంలో ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరండి. అయితే, ఆది, గురువారాలు నిదానం అవసరం.

వృషభం : మీరు అమితంగా ఇష్టపడే వారికి మనస్సులోని భావాలను బుధ, గురువారాలలో వెల్లడించండి. ఈ రోజులు అనుకూలమైనందున ఆవతలి వైపు నుంచి కూడా ఊహించిన సందేశాలు రావచ్చు. ఇటువంటి సమయంలో పింక్, ఎల్లో రంగు దుస్తులు ధరించండి. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. కాగా, శని, ఆదివారాలు ఇటువంటి ప్రతిపాదనలకు దూరంగా ఉండండి.

మిథునం : మీ అభిప్రాయాలను ప్రియమైన వారికి వెల్లడించేందుకు శుక్ర, బుధవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈరోజుల్లో మీ అభిప్రాయాలకు అనుగుణంగా ఆవతలి వారు కూడా స్పందించే  వీలుంది. ప్రేమ ప్రతిపాదనల సమయంలో మీరు ఆరెంజ్, చాక్లెట్‌ రంగు దుస్తులు ధరించండి. అలాగే, ఇంటి నుంచి ఉత్తర ఈశాన్యదిశగా బయలుదేరితే శుభదాయకం. ఇక ఆది, మంగళవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది.

కర్కాటకం : మీరు ఇష్టపడే వారికి ప్రేమ సందేశాలు అందించేందుకు శని, ఆదివారాలు అనుకూలమైనవి. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతిపాదనలకు ఆవతలి వైపు నుంచి కూడా సానుకూల సందేశాలు అందే వీలుంటుంది. ప్రతిపాదనల సమయంలో మీరు వైట్, గ్రీన్‌ రంగు దుస్తులు ధరిస్తే సత్ఫలితాలు ఉంటాయి. అలాగే, పశ్చిమ వాయువ్య దిశగా ఇంటి నుంచి బయలుదేరితే అనుకూల ఫలితాలు రావచ్చు. అయితే, మంగళ, గురువారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి.

సింహం : మీ మనస్సులోని భావాలను ఇష్టులకు తెలియజేసేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలం. ఈ రోజుల్లో చేసే ప్రతిపాదనలకు ఆవతలి వారు కూడా సానుకూలంగా స్పందించే వీలుంది. ఇటువంటి సమయంలో మీరు రెడ్, గ్రీన్‌ రంగు దుస్తులు ధరించండి. ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. ఇక, శుక్ర, బుధవారాలు అంత అనుకూలం కానందున మౌనం వహించండి. 

కన్య : మీరు అమితంగా ఆరాధించే వారికి మీ ప్రతిపాదనలు పంపేందుకు సోమ, గురువారాలు అనుకూలమైనవి. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలను ఆవతలి వారు అంగీకరించే వీలుంటుంది. ఇక ఇటువంటి సమయంలో పింక్, ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరితే మంచిది. అయితే శుక్ర, శనివారాలు వీటికి దూరంగా ఉండండి.

తుల : మీ సందేశాలను ఇష్టమైన వారికి పంపేందుకు శని, బుధవారాలు అత్యంత సానుకూలమైనవిగా చెప్పవచ్చు. ఇటువంటి సమయంలో మీరు చేసే ప్రేమ ప్రతిపాదనలు ఆమోదం పొందే వీలుంది. ఈరోజుల్లో మీరు గ్రీన్, వైట్‌ రంగు దుస్తులు ధరిస్తే ఫలితం కనిపిస్తుంది. అలాగే ప్రేమకు సంబంధించిన పనులు మొదలుపెట్టే సమయంలో ఇంటి నుంచి ఉత్తర ఈశాన్య దిశగా బయలుదేరితే శుభదాయకం. అయితే సోమ, మంగళవారాలు మాత్రం ఇటువంటి వాటికి దూరంగా ఉండండి.

వృశ్చికం : మీరు ఇష్టపడే వారికి మీ ప్రతిపాదనలు అందించేందుకు ఆది, సోమవారాలు విశేషంగా కలసివచ్చే వీలుంది. మీ ప్రతిపాదనలకు ఆవతలి వైపు నుంచి కూడా సానుకూల స్పందన రావచ్చు.  ఈరోజుల్లో మీరు ఎల్లో, చాక్లెట్‌ రంగు దుస్తులు ధరించడం మంచిది. ఇక ఇంటి నుంచి  దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరితే మరింత కలసివస్తుంది. అయితే శుక్ర, బుధవారాలు తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఈరోజుల్లో మౌనం అన్ని విధాలా మంచిది.

ధనుస్సు : మీ ప్రేమసందేశాలు, వివాహ ప్రతిపాదనలు అందించేందుకు శని, బుధవారాలు అత్యంత అనుకూలమైన రోజులు. ఈ సమయంలో మీరు చేసే ప్రతిపాదనలపై ఆవతలి వైపు నుంచి సానుకూల సమాచారాలు అందే వీలుంది. ఇటువంటి సమయంలో మీరు పింక్, ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరించండి. అలాగే, ప్రేమకు సంబంధించిన పనులు మొదలుపెట్టే సమయంలో ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. ఇక ఆది, మంగళవారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది. 

మకరం : మీ అభిప్రాయాలను ఇష్టమైన వారికి తెలిపేందుకు ఆది, గురువారాలు సానుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో ఆవతలి వైపు నుంచి కూడా అనుకూల స్పందన రావచ్చు. ప్రేమ ప్రతిపాదనలు చేసే సమయంలో మీరు వైట్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, పశ్చిమదిశగా ఇంటి నుంచి బయలుదేరితే శుభదాయకంగా ఉంటుంది. అయితే శుక్ర, మంగళవారాలు మౌనం వహించడం ఉత్తమం.

కుంభం : మీ మనస్సులోని భావాలు ఇష్టమైన వారికి తెలిపేందుకు శుక్ర, సోమవారాలు అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో చేసే ప్రతిపాదనలకు మీరు ఊహించిన ఫలితం వచ్చే వీలుంటుంది. ఇటువంటి ప్రతిపాదనలు చేయడానికి రెడ్, పింక్‌ రంగు దుస్తులు ధరించి ప్రయత్నించండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే, ఇంటి నుంచి దక్షిణదిశగా ఇంటి నుంచి బయలుదేరండి. అయితే, ఆది, గురువారాలు మాత్రం వీటికి దూరంగా ఉండండి.

మీనం : మీ ప్రతిపాదనలు ప్రియమైన వారికి అందించేందుకు శని, సోమవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలకు ఆవతలి వారి వైపు నుంచి అనుకూల స్పందనలు రావచ్చు. అలాగే, ఇటువంటి సమయంలో మీరు రెడ్, ఎల్లో రంగు దుస్తులు ధరించడం మంచిది. అలాగే, ఉత్తరదిశగా ఇంటి నుంచి బయలుదేరండి, శుభవర్తమానాలు రావచ్చు. అయితే ఆది, బుధవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement