తమిళసినిమా: ఇంత వరకూ తమిళ తెరపై రానటువంటి సరికొత్త ప్రేమకథా చిత్రంగా అభియుమ్ అనువుమ్ ఉంటుందని ఆ చిత్ర దర్శకురాలు బీఆర్.విజయలక్ష్మి పేర్కొన్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు సంతోష్‌శివన్ నిర్మాణ నిర్వహణ బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని యూడిల్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. నటి పియాబాజ్‌పాయ్ కథానాయకిగా నటిస్తున్న ఇందులో నవ నటుడు డావినో థామస్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సుహాసిని, ప్రభు,రోహిణి, మనోబాల నటిస్తున్నారు.
చిత్రం గురించి దర్శకురాలు బీఆర్.విజయలక్ష్మి వివరిస్తూ ఇంతవరకూ ఎవరూ హ్యాండిల్ చేయని కథ కావడంతో చాలా జాగ్రత్తగా అభియుమ్ అనువుమ్ చిత్రాన్ని తెరకెక్కించాల్సి వచ్చిందన్నారు. నటి పియాబాజ్‌పాయ్ తన నట కెరీర్‌లోనే దీ బెస్ట్ పర్ఫార్మెన్స్‌ను ఇచ్చిన చిత్రం ఇదే అవుతుందన్నారు. కొందరు ఇది కేన్సర్ ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రం అని అనుకుంటున్నారని, కేన్సర్‌కు ఈ చిత్రానికి అసలు సంబంధం ఉండదని అన్నారు. లాఠిన్ అమెరికాలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న విభిన్న కథా చిత్రంగా అభియుమ్ అనువుమ్ ఉంటుందని తెలిపారు. చిత్రం సంతృప్తికరంగా వచ్చిందని, త్వరలోనే చిత్ర విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకురాలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment