అఖిల్, నితిన్ లపై సమంత సెటైర్లు | Akhil chit chat with Nithin and Samantha on Twitter | Sakshi
Sakshi News home page

అఖిల్, నితిన్ లపై సమంత సెటైర్లు

Published Fri, Nov 6 2015 5:54 PM | Last Updated on Sun, Sep 3 2017 12:08 PM

అఖిల్, నితిన్ లపై సమంత సెటైర్లు

అఖిల్, నితిన్ లపై సమంత సెటైర్లు

స్టన్నింగ్ బ్యూటీ సమంత.. టాలీవుడ్ యువహీరోలు అఖిల్, నితిన్లపై సెటైర్లు వేసింది. అక్కినేని కుటుంబంలో నవతరం హీరో అఖిల్ మొదటి సినిమా దీపావళి కానుకగా విడుదల కానున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం అఖిల్ అభిమానులతో తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా లైవ్ చిట్ చాట్ చేశారు. అయితే ఈ లైవ్ చిట్ చాట్లో హీరో నితిన్ సరదాగా అఖిల్ను.. 'హాయ్ అఖిల్ గారు..నన్ను మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు?' అంటూ ప్రశ్నించారు. దానికి అఖిల్ స్పందిస్తూ.. 'నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను నితిన్ గారు' అంటూ సమాధానం ట్వీట్ చేశారు.

ఇది గమనించిన సమంతా వెంటనే నితిన్తో..  'నితిన్.. ఈ కెమిస్ట్రీ నాతో ఉంటే మనం బ్లాక్బస్టర్ సినిమా ఇవ్వొచ్చు' అంటూ కామెంట్ చేసింది. సమంత కామెంట్కు స్పందించిన నితిన్.. మా 'బ్రొ'మాన్స్ మధ్య విలన్గా రావద్దు సామ్స్ అంటూ ట్వీట్ చేశారు. అయితే అఖిల్ మాత్రం.. 'సామ్స్, ప్లీజ్.. నితిన్కు ఎమోషనల్ సీన్స్ ఇవ్వమని త్రివిక్రమ్ గారికి చెప్పు, అప్పుడు నితిన్ నన్ను మిస్ అవుతాడు' అనగానే సమంతా.. అప్పుడు నేను నితిన్ను తోసేస్తాను అంటూ ఆన్సర్ ఇచ్చారు.  త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అ ఆ' అనే చిత్రంలో నితిన్, సమంత జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా నీకు సినిమాలో హీరోయిన్ సయేషా ఎక్కువ నచ్చిందా.. లేక బ్రహ్మానందం నచ్చారా.. ఇద్దరి పేర్లు మాత్రం చెప్పొద్దు అంటూ నితిన్ ప్రశ్నించగా,  త్రివిక్రమ్ గారికి కాల్ చేసి నీ మీద కంప్లైంట్ చేస్తాను.. చిట్ చాట్ డిస్టర్బ్ చేస్తున్నావని అంటూ అఖిల్.. నితిన్కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement