ఆమె అటు సగం.. ఇటు సగం అట!
ఈసారి జనరంజకమైన పాత్రలో అలరించడానికి సిద్ధం అయ్యారు. ఇండియన్ హాస్యభరిత కథా చిత్రాలలో మలయాళ చిత్రాలలో కామెడీ సహజత్వంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాంటి వినోదాత్మక కథా చిత్రంగా రోసాపూ అనే చిత్రం రూపొందుతోంది. వినూ జోసఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బిజూ మీనన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు నటించిన మూడు చిత్రాలు 100 రోజులు ప్రదర్శితమయ్యాయి. రోసాపూ చిత్రంలో ఆయనతో పాటు నీరజ్ యాదవ్, శోభన్ షబీర్, దిలీప్‌పోతన్, అంజలి, శిల్పామంజునాద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఈ నెల 23వ తేదీన ప్రారంభమయ్యింది.
చిత్రంలో నటి అంజలిని ఎంపిక చేయడం గురించి దర్శకుడు వివరిస్తూ.. రోసాపూ చిత్రంలో కథానాయకి సగం తమిళం,సగం కన్నడం భాషలు తెలిసిన అమ్మాయి అని తెలిపారు. ఈ పాత్రకు నటి అంజలి అయితే బాగుంటుందనీ ఆమెను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ పాత్ర చాలా వినోదభరితంగా ఉంటూ కథానాయకునికి పక్కా బలాన్నిచ్చేదిగా ఉంటుందని చెప్పారు. ఇది అంజలి కేరీర్‌లో ఒక మకుటంగా నిలిచిపోతుందని అన్నారు. ఇప్పుడు మలయాళం చిత్రాలు కోలీవుడ్, టాలీవుడ్‌ల్లోనూ అనువాదం అయ్యి లాభదాయకంగా మారుతున్నాయి కాబట్టి ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు ప్రేక్షకులు చూసే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.