పెద్ద సవాల్‌ | AR Rahman to compose for Bruce Lee biopic | Sakshi
Sakshi News home page

పెద్ద సవాల్‌

Published Mon, Sep 18 2017 12:42 AM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM

పెద్ద సవాల్‌

పెద్ద సవాల్‌

బ్రూస్‌ లీ... పరిచయం అక్కర్లేని పేరు. మార్షల్‌ ఆర్ట్స్‌కు పెట్టింది పేరు. ‘ది బిగ్‌ బాస్‌’, ‘ఫిస్ట్‌ ఆఫ్‌ ఫ్యూరీ’, ‘ఎంటర్‌ ది డ్రాగన్‌’ వంటి చిత్రాల ద్వారా నటుడిగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. డాక్యుమెంటరీస్‌ తీశారు. 32 ఏళ్ల వయసులో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. బ్రూస్‌లీ చనిపోయి 40 ఏళ్లు పైనే అయినప్పటికీ ప్రేక్షకులు మనసుల్లో మిగిలిపోయారు.

ఈ మార్షల్‌ ఆర్ట్స్‌ కింగ్‌ జీవితంలో ఎదుర్కొన్న గెలుపు, ఓటములను బాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌ కపూర్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్‌ విన్నర్‌ ఎ.ఆర్‌. రెహమాన్‌ను సంప్రదించగా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చేయడానికి ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. ‘‘ఈ సినిమా నాకో పెద్ద సవాల్‌. ఎందుకంటే శేఖర్‌ కపూర్‌ చాలా ఎక్స్‌పెక్ట్‌ చేస్తాడు’’ అంటున్నారు రెహమాన్‌. బ్రూస్‌లీ పాత్రకు సూట్‌ అయ్యే హీరోని ఎంపిక చేసే పనిలో శేఖర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement