తెరపైకి కమెడియన్ పుత్రుడు | comedian's son introducing as hero | Sakshi
Sakshi News home page

తెరపైకి కమెడియన్ పుత్రుడు

Published Sat, Oct 19 2013 7:40 PM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM

సీనియర్ హాస్యనటుడు జయమణి వారసుడే ఈ వర్షన్

సీనియర్ హాస్యనటుడు జయమణి వారసుడే ఈ వర్షన్

కోలీవుడ్‌కు మరో హీరో పరిచయం అవుతున్నారు. ఈయన పేరు వర్షన్. సీనియర్ హాస్యనటుడు జయమణి వారసుడే ఈ వర్షన్. తిరుపాచ్చి, శివశక్తి, తిరుపతి, సింగం, వేంగై ఇలా 150 పైగా చిత్రాల్లో నటించారు జయమణి. గౌండమణి, సెంథిల్, వడివేలు, వివేక్ వంటి వారితో కలసి హాస్యం పండించారు. ఇప్పుడు తన కుమారుడిని హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు.

జయమణి మాట్లాడుతూ వర్షన్ బీఈ (కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశాడన్నారు. ఒక పెద్ద ఐటీ కంపెనీలో నెలకు లక్ష రూపాయలు సంపాదించే ఉద్యోగం వచ్చిందని తెలిపారు. అయినా వర్షన్‌కు నటుడవ్వాలన్న కోరిక బలంగా ఉందని గ్రహించానన్నారు. నటుడికి కావలసిన అన్ని అర్హతలూ వర్షన్‌లో ఉన్నాయని చెప్పారు. అదువేరే ఇదువేరే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవడం సంతోషంగా ఉందన్నారు. ఇది పూర్తి వినోదభరిత చిత్రమని తెలిపారు.

వర్షన్ మాట్లాడుతూ జయంతి, శ్రీధర్, దినేష్ మాస్టర్ల వద్ద నృత్యం, పాండియన్ మాస్టర్ వద్ద ఫైట్స్‌లో శిక్షణ పొందానన్నారు. కూత్తు పట్టరైలో నటనలో తర్ఫీదు పొందినట్లు వివరించారు. నటుడికి కావలసిన అర్హతలు సంపాదించిన తర్వాత అవకాశాల వేట ప్రారంభించానని చెప్పారు. అదువేరే ఇదువేరాతో చిత్ర నిర్మాత జయశీలన్, దర్శకుడు తిలక్‌రాజన్ హీరోగా అవకాశం ఇచ్చారని తెలిపారు.

భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సమయంలో తాను అందులో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. సానియాతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో గంజాకరుప్పు, సింగముత్తు, ఇమాన్ అన్నాచ్చి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. వైవిధ్యభరిత పాత్రలనే ఎంపిక చేసుకుంటానని వర్షన్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement