అప్పట్లో దీపిక డిప్రెషన్లో ఉందా? | Deepika padukone describes how she overcomed depression | Sakshi
Sakshi News home page

అప్పట్లో దీపిక డిప్రెషన్లో ఉందా?

Published Mon, Jul 11 2016 6:21 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

అప్పట్లో దీపిక డిప్రెషన్లో ఉందా? - Sakshi

అప్పట్లో దీపిక డిప్రెషన్లో ఉందా?

దీపికా పదుకొనే.. బాలీవుడ్ను ఏలేస్తున్న టాప్ హీరోయిన్లలో ఒకరు. అంతేకాదు.. భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్రకాష్ పదుకొనే కూతురు కూడా. ఆమె పట్టింది బంగారమే. అలాంటిది ఆమె కూడా డిప్రెషన్లో పడిందంటే నమ్మగలరా? కానీ.. అది నిజమేనట. నిజానికి దీపికా పదుకొనే కూడా బ్యాడ్మింటన్లో జాతీయ స్థాయి వరకు ఆడింది. తర్వాత సినిమాల్లోకి వచ్చింది. సరదాగా చేద్దామని చేసిన మొదటి సినిమానే షారుక్ ఖాన్ సరసన ఓం శాంతి ఓం కావడంతో ఆమె కెరీర్ విషయంలో ఇక తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

కానీ ఒకానొక సమయంలో దీపిక తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయిందట. కానీ ఆ విషయాన్ని ఆమే స్వయంగా గుర్తించి.. దాన్ని అధిగమించడానికి బాగా కష్టపడింది. ప్రధానంగా ఆటల ద్వారానే డిప్రెషన్ను తాను అధిగమించానని, అందువల్ల ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక ఆటను ఎంచుకుని తరచు ఆడుతుండాలని చెప్పింది. దానివల్ల జీవితంలో జయాపజయాలను ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుందని వివరించింది.

రెండేళ్ల క్రితం తాను డిప్రెషన్లోకి వెళ్లినప్పుడు ఆటల ద్వారానే అన్ని కష్టాలూ అధిగమించినట్లు దీపిక చెప్పింది. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలో నటిస్తున్న ఆమె.. ఆ తర్వాత సంజయ్ లీలా భన్సాలీ తీస్తున్న సినిమాలో పద్మావతి పాత్ర పోసిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement