![hero venkatesh act once again multi star movie? - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/8/venki.jpg.webp?itok=7-9GAumR)
ప్రేక్షకులకు ఈసారి ఎలాంటి డిష్ (మల్టీస్టారర్ కథ) వడ్డించాలనే విషయంలో దర్శక–నిర్మాతలు అనిల్ రావిపూడి, ‘దిల్’ రాజులు ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇప్పుడా డిష్‌లోకి కావల్సిన మసాలాలు నూరే పనిలో అనిల్ ఆల్రెడీ దిగారు. డిష్‌లో ఏ మసాలా (సీన్) ఎప్పుడు వేస్తే (పడితే) రుచిగా ఉంటుందోననే ఆలోచనలో పడ్డారు. అదేనండీ... కథకు కావల్సిన సీన్లు, స్క్రీన్‌ప్లే గట్రా రెడీ చేస్తున్నారట! ఇదంతా ఓకే... మసాలాలను ఎవరికి దట్టిస్తారు? అంటే... వెంకటేశ్‌కి అనేది కృష్ణానగర్ కుర్రాళ్ల ఖబర్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించనున్న మల్టీస్టారర్ సినిమాలో నటించేందుకు వెంకీ అంగీకరించారట! ఆల్రెడీ వెంకీతో అనిల్ ఒకసారి వర్క్ చేశారు.
అయితే... దర్శకుడిగా కాదు, మాటల రచయితగా! వెంకీ–రామ్ హీరోలుగా నటించిన మల్టీస్టారర్ ‘మసాలా’కు అనిల్ మాటలు రాశారు. సో... అతని గురించి, అతని వర్కింగ్ స్టైల్ గురించి వెంకీకి ఐడియా ఉంది. అందువల్ల, లేటెస్ట్ మల్టీస్టారర్‌కి వెంటనే ఓకే చెప్పేశారట! మల్టీస్టారర్ అంటే మరో స్టార్ కావాలి కదా! అతనెవరు? అంటే... ఓ యంగ్ హీరో. అతను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వంట (షూటింగ్) మొదలుపెడతారట! అవునా? ఆ యంగ్ హీరో ఎవరు? అంటే... త్వరలోనే పేరు బయటకొచ్చే అవకాశాలున్నాయి. అన్నట్లు... ఈ సినిమాకి ‘ఎఫ్ 2’ అనే టైటిల్ అనుకుంటున్నారట. అంటే.. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అట.
Comments
Please login to add a commentAdd a comment