సల్మాన్ ఖాన్ (ఫైల్)
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌కు ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సల్మాన్‌కు అభిమానులు ఉన్నారు. అభిమానులు తమ హీరోల కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు. అందుకు నిదర్శనమే ఈ సంఘటన. తాజాగా సల్మాన్ అభిమాని ఒకరు ఇంట్లో నుంచి పారిపోయి ముంబైలోని సల్మాన్ ఇంటిలోకి ప్రవేశించేందుకు యత్నించింది.
పోలీసుల తెలిపిని వివరాల ప్రకారం.. భోపాల్‌కు చెందిన ఓ పదిహేనేళ్ల అమ్మాయి ఇంటి నుంచి పారిపోయి ముంబైలోని బాంద్రాలో ఉండే సల్మాన్ ఇంటికి వచ్చి, లోపలకి వెళ్లేందుకు ప్రయత్నించింది. సెక్యూరిటీ గార్డ్‌లు సల్మాన్‌ఖాన్ ఇంట్లో లేరని సర్దిచెప్పారు. కొంత సమయం గడిచిన తరువాత గోడ ఎక్కి లోపలకు వెళ్లేందుకు యత్నించిగా సెక్యూరిటీ గార్డులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మైనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మైనర్ బాలికను తీసుకొచ్చి స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్టు బాంద్రా పోలీస్‌స్టేషన్ సీనియర్ ఎస్సై పండిత్ థాకరే తెలిపారు. ఆమె తల్లిదండ్రులు మధ్యప్రదేశ్‌లోని బెరాసియాలో అదృశ్యం కేసు పెట్టారని, బాలిక ముంబైలో ఉన్నట్టు వారికి సమాచారం అందించినట్టు చెప్పారు. బాలికను డోంగ్రి బాలల గృహానికి తరలించామని, తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వారికి అప్పగిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment