అమెరికాలో కాజల్... జిల్ జిల్! | Nisha Agarwal Kajal Agarwal Enjoy in america trip | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాజల్... జిల్ జిల్!

Published Wed, Jul 8 2015 10:40 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

అమెరికాలో కాజల్... జిల్ జిల్! - Sakshi

అమెరికాలో కాజల్... జిల్ జిల్!

తెల్లారిందా.. నిద్రలేచామా... కాసిన్ని ఎక్సర్‌సైజ్‌లు చేశామా... మేకప్ చేసుకుని షూటింగ్‌కి వెళ్లామా... ప్యాకప్ చెప్పాక ఇంటికొచ్చామా... మంచి ఫామ్‌లో ఉన్న తారల జీవితం దాదాపు ఇంత హడావిడిగానే ఉంటుంది. ఏం తింటున్నాం? ఎంతసేపు నిద్రపోతున్నాం? అనే విషయాల గురించి పట్టించుకునేంత తీరిక లేకుండా ఉంటారు. అలా బిజీగా ఉండే తారల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ‘‘యాక్చువల్లీ రోజుకి 24 గంటలు షూటింగ్ చేయమన్నా నేను చేసేస్తా.. నాకు పనంటే అంత ప్రేమ’’ అని చెబుతుంటారు కాజల్. కానీ, ఎంత పనిమంతు లైనా ఒక్కోసారి అలసిపోతుంటారు. అప్పుడు ఫుల్‌గా రిలాక్స్ కావాలనుకుంటారు.
 
 కాజల్ కూడా అలానే అనుకున్నారు. అమ్మా నాన్న సుమన్, వినయ్ అగర్వాల్, చెల్లెలు నిషా అగర్వాల్‌తో కలిసి ఇటీవల యూఎస్ వెళ్లారు. విదేశీ వీధుల్లో హాయిగా తిరుగుతూ, ఎంజాయ్ చేస్తున్నారు కాజల్. కాఫీ షాప్స్, రెస్టారెంట్స్‌కు వెళుతూ విదేశీ ఫుడ్‌ని ఆస్వాదిస్తున్నారు. అలాగే, షాపింగ్ చేస్తున్నారు. పనిలో పనిగా కాలిఫోర్నియాలోని యూనివర్శల్ స్టూడియోస్‌ను కూడా  సందర్శించారు. ఇప్పటికి కాజల్ అండ్ ఫ్యామిలీ విహార యాత్రకు వెళ్లి, దాదాపు వారం రోజులైంది. ఈ వారం రోజులకు సంబంధించిన తీపి గుర్తులుగా కొన్ని ఫొటోలు దిగి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement