'పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావొద్దు'
'పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావొద్దు'
Published Thu, Mar 6 2014 12:45 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరంగేట్రంపై మీడియాతోపాటు సోషల్ మీడియాలో కూడా చర్చ బాగానే జరుగుతోంది. పవన్ రాజకీయాల్లోకి రావాలంటూ పలువురు ఆహ్వానిస్తుండగా, మరికొందరు రావొద్దని సలహా ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావొద్దని టాలీవుడ్ దర్శకుడు జయంత్ సీ పరాంజీ సలహా ఇచ్చాడు.
'ఓ శ్రేయోభిలాషిగా పవన్ కు విజ్క్షప్తి చేస్తున్నాను. ప్లీజ్...ప్లీజ్...ప్లీజ్... రాజకీయాల్లోకి రావొద్దు. రాజకీయాలు ఓ రొంపి అని అన్నారు. ముక్కు సూటిగా వ్యవహరించే నీలాంటి వ్యక్తులకు రాజకీయాలు సరిపడవు. ఈ కుళ్లు పట్టిన ఈ వ్యవస్థను కడిగిపారేయాలంటే.. రాజకీయాలను ఎంచుకోకుండా మరో విధంగా సేవలందించాలి' సోషల్ మీడియాలో జయంత్ సూచించారు.
పవన్ కళ్యాణ్ నటించిన 'తీన్ మార్' చిత్రానికి జయంత్ సి పరాంజీ దర్శకత్వం వహించారు.
Advertisement
Advertisement